నల్లగొండ జిల్లా:వేసవిలో పశువుల దాహం తీర్చేందుకు లక్షలాది రూపాయల ప్రజాధనంతో గ్రామాల్లో ఏర్పాటు చేసిన నీటితొట్లు నల్లగొండ జిల్లా వేములపల్లి మండలంలో నిరుపయోగంగా మారాయని మండల ప్రజలు ఆరోపిస్తున్నారు.వాటిలో నీరు నిలువ చేయకపోవడంతో మూగ జీవాలకు గుక్కెడు నీరు దొరకని పరిస్థితి ఏర్పడిందని,కొన్ని గ్రామాలలో నిర్మించిన నీటి తొట్టెలు శిథిలావస్థకు చేరాయని,మరికొన్ని గ్రామాల్లో నీటితొట్టెలను ధ్వంసం చేశారని,గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులతో వెచ్చించి నిర్మిస్తే వాటిని ఉపయోగంలోకి తీసుకురావడంలో అధికారులు పూర్తిగా విఫలమయ్యారని,ఈ ఏడాది వేసవికాలం ముందుగానే ప్రారంభమైందని,భూగర్భ జలాలు అడుగంటి పశువులకు,పక్షులకు నీరు దొరికే పరిస్థితి లేకుండా పోయిందని,ప్రభుత్వం చేపట్టిన నీటితొట్లు ఉపయోగపడక తాగునీటి కోసం పశువులు అల్లాడే పరిస్థితి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.మండలంలో 11 గ్రామపంచాయతీల్లో నీటితొట్టెల నిర్మాణానికి రూ.10 లక్షల ఖర్చు చేశారని,నీటితొట్టెలోకి నీరు రావడానికి పైపులైను కూడా వేశారని,వాటిపై అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతోనే నిరుపయోగంగా మారి శిధిలావస్థకు చేరి,వాటిలో పిచ్చి మొక్కలు మొలిచి నీటితొట్ల జాడే కనపడకుండా పోయిందని అంటున్నారు.ఈ నీటితొట్లు ఉపయోగపడేది ఎండాకాలంలోనే కాబట్టి పశువులకు నీరు ఎక్కడపడితే అక్కడ ఉండకపోవడంతో దాహార్తితో ఇబ్బంది పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని,ఇప్పటికైనా అధికారులు,పాలకులు స్పందించి గ్రామాల్లో పశువుల కోసం ఏర్పాటు చేసిన నీటితొట్టెలలో నీరు నిల్వ ఉంచే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
Latest Nalgonda News