రక్త పిశాచి పీడితులకు చేయూతనివ్వండి...!

నల్లగొండ జిల్లా:సీఎం కేసీఆర్ కు కమ్యూనిస్టు నేతాజీ కామ్రేడ్ బోరన్నగారి సుభాష్ చంద్రబోస్ బహిరంగ లేఖ .తల సేమియా,సికిల్ సెల్ తదితర అరుదైన వ్యాధుల బరినపడిన 20 లక్షల మందికి పైగా బాధితులకు చేదోడుగా నిలవండని సీపీఐ ఎంఎల్ రాష్ట్ర కార్యదర్శి బోసన్న డిమాండ్ చేశారు.

 Help The Vampire Sufferers…!-TeluguStop.com

ఆర్థికంగా చితికిపోతున్న పేద,మధ్యతరగతి కుటుంబాలకు బాసటగా నిలవండని ప్రజా నేస్తం బోరన్నగారి సుభాషన్న విజ్ఞప్తి చేశారు.వైకల్య ధ్రువపత్రం ఉన్నా పింఛనుకు నోచుకోక వెతలు పడుతున్న బాధితుల గోడు వినండి కెసిఆర్ కు సామాజిక కార్యకర్త బోరన్నగారి సుభాషన్న వినతి.

జీవో ఇచ్చి నాలుగేళ్లయినా ఇంకెప్పుడు అమలు చేస్తారు?ముఖ్యమంత్రిని నిలదీసిన విప్లవ నాయకుడు బోరన్నగారి సుభాషన్న.సాధారణ వ్యాధుల చికిత్సలకే ఇల్లు గుల్లవుతున్న ప్రస్తుత పరిస్థితులలో ఇక తల సేమియా,పెట్రోసిస్ హిమోపిలియా,సికిల్ సెల్ ,అనీమియా,ప్రైమరీ జమ్యునో డెఫిషియన్సీ ఆటో ఈమీయిన్ డిసీజ్,మస్కులర్ డిస్ట్రఫీ తదితర అరుదైన వ్యాధుల చికిత్సకు లక్షల్లో రూపాయలు వెచ్చించాల్సి రావడంతో ఆయా బాధిత కుటుంబాలు ఎంతగానో ఆర్థికంగా చితికి పోతున్నాయని ప్రముఖ ప్రజా ఉద్యమకారుడు కమ్యూనిస్టు పార్టీ నేతాజీ బోరన్న గారి సుభాష్ చంద్రబోస్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.

దీనికి తోడు ధృవపత్రాల జారీలోనూ జరుగుతున్న తీవ్ర జాప్యం కారణంగా ఈ బాధితులు మరింతగా నష్టపోతున్నారని దేశంలో ఏడు వేలకు పైగా అరుదైన వ్యాధులు 8 నుండి 9 కోట్ల మంది బాధితులు ఉంటారని బోరన్నగారి నేతాజీ పేర్కొన్నారు.తెలంగాణలో ఇలాంటివారు 20 లక్షలకు మందిపైగా ఉన్నట్లు భారత అరుదైన వ్యాధుల నిర్ధారణ సంస్థ పేర్కొన్న విషయాన్ని బోరన్నగారు ముఖ్యమంత్రి కేసీఆర్ కు రాసిన బహిరంగ లేఖలో తెలిపారు.అయితే సాధారణ వ్యాధులతో పోలిస్తే వీరి సంఖ్య స్వల్పం కావడంతో ఔషధ సంస్థలు ఆయా మందుల ఉత్పత్తిపై దృష్టి సారించడం లేదని సామాజిక కార్యకర్త కామ్రేడ్ బోరన్నగారి సుభాషన్న ఆవేదన వ్యక్తం చేశారు ఆరోగ్యశ్రీలోనూ ఈ వ్యాధులకు చికిత్స లేదని వీరికి ఉపశమనంగా వైకల్య ధ్రువపత్రాలు పింఛను ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం నాలుగేళ్ల క్రితం ఉత్తర్వులు ఇచ్చినా నేటికీ అమల్లోకి రాదని రాలేదని ముఖ్యమంత్రి కేసీఆర్ కు బోరన్న గారి సుభాషన్న రాసిన బహిరంగ లేఖలో పేర్కొన్నారు.3016 రూపాయల పింఛను అందితే ఆర్థికంగా బాసటగా ఉంటుందని బాధిత కుటుంబ సభ్యులు అంటున్నారు.వీరికి ఉన్నత చదువులు ప్రభుత్వ ఉద్యోగాల్లో కేంద్రం ఒక శాతం రిజర్వేషన్లు కల్పించింది.రాష్ట్రంలో ధ్రువపత్రం జారీ చేయకపోవడంతో ఆయా ప్రయోజనాలను బాధితులు కోల్పోతున్నారని ముఖ్యమంత్రి కేసీఆర్ కి రాసిన బహిరంగ లేఖలో బోరన్న గారి నేతాజీ పేర్కొన్నారు.ఎనిమిది రకాల వ్యాధులు వైకల్య జాబితాలో తెలంగాణ ప్రభుత్వం 2018 జూన్ 13న చేర్చినప్పటికీ ఆయా బాధితులను నేటికీ పట్టించుకోవడం లేదని ప్రజా నేస్తం బోరన్నగారి సుభాషన్న 8328277285 ఆవేదన వ్యక్తం చేశారు .1.లోకో మోటర్ డిజేబిలిటీ,సెలెబ్రెల్ ఫాల్సి ముష్కులర్ డిస్ట్రాఫీ 2.అందత్వం తక్కువ చూపు 3.వినికిడి లోపం 4.ఇంటలెక్చువల్ డిజేబులిటీ లెర్నింగ్ డిజేబిల్టీ 5.మానసిక అనారోగ్యం 6.క్రానిక్ న్యూరాలజికల్ కండిషన్స్ తో వైకల్యం 7.హిమోఫిలియో తల సేమియా సికిల్ సెల్ వ్యాధి 8.మల్టిపుల్ డిజిబిలిటీస్ ఈ వ్యాధుల బాధితుల గోడు వినాలని,బాధితులకు బాసటగా నిలవాలని, తక్షణమే బాధిత కుటుంబాలకు చేయూతనివ్వాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ను ప్రజా ఉద్యమకారుడు బోరన్నగారి సుభాషన్న డిమాండ్ చేశారు.తెలంగాణ రాష్ట్ర సర్కారు అత్యవసరంగా దృష్టి పెట్టాల్సిన వాటిని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుకి సిపిఐ ఎంఎల్ కార్యదర్శి బోరన్నగారి సుభాషన్న బహిరంగ లేఖలో గుర్తు చేశారు.తక్షణమే తల సేమియా,సికిల్ సెల్ బాధితులకు వైకల్య ధ్రువపత్రాలు జారీ చేయాలని సీఎం కేసీఆర్ ను సిపిఎంఎల్ కార్యదర్శి బోరన్నగారి నేతాజీ డిమాండ్ చేశారు.

ఉన్నత విద్య ప్రభుత్వ ఉద్యోగాల్లో రాష్ట్రంలోనూ ఒక శాతం రిజర్వేషన్ వర్తింపజేయాలని బోరన్నగారి సుభాషన్న కోరారు.ఈ బాధితులకు తరచూ రక్త మార్పిడితో శరీరంలో ఐరన్ అధికంగా పేరుకు పోతుంటుంది దీనిమూలంగా జీవితాంతం ఇంజక్షన్లు మాత్రలు వేసుకోవాలి,ఇటువంటి వ్యాధిగ్రస్తులకు ప్రభుత్వం ఉచితంగా వైద్యం అందించాలని ప్రజా నేస్తం బోరన్నగారి సుభాషన్న సీఎం కేసీఆర్ ను కోరారు.

రక్తమార్పిడి కోసం బాధితులు ఆస్పత్రులకు ప్రయాణం చేయాల్సి వస్తుంది.వీరికి వీరి యొక్క సహాయకుడికి అన్ని రకాల బస్సు సర్వీసులలో ఉచిత ప్రయాణ వసతి కల్పించాలని ప్రజా బంధువు బోరన్నగారి నేతాజీ సుభాషన్న 9848540078 ముఖ్యమంత్రి కేసీఆర్ కు రాసిన బహిరంగ లేఖలో విజ్ఞప్తి చేశారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube