నల్లగొండ జిల్లా: గట్టుప్పల మండలంలోని సాంఘిక సంక్షేమ హాస్టల్లో ఉండే విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని కుల వివక్ష పోరాట సమితి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బొట్టు శివకుమార్ డిమాండ్ చేశారు.ఆ సంఘం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు నియోజకవర్గంలో అధ్యయన యాత్రలో భాగంగా శనివారం గట్టుప్పల మండల కేంద్రంలో ఎస్టీ బాలుర హాస్టల్లను సందర్శించి, సర్వే నిర్వహించి, విద్యార్థుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు.
హాస్టల్లో బాత్రూంలో సరిగా లేక,లైట్లు,ఆట వస్తువులు లేక అనేక ఇబ్బందులు పడుతున్నా సంబంధిత అధికారులు పట్టించుకోవడంలేదని ఆరోపించారు.తక్షణమే సమస్యలు పరిష్కరించకపోతే కెవిపిఎస్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు ఖమ్మం రాములు,చారి,దుబ్బాక యాదయ్య,నరసింహ, సైదులు తదితరులు పాల్గొన్నారు.