నల్గొండ జిల్లా: నాగార్జున సాగర్ ఎమ్మెల్యే నోముల భగత్ ప్రజలను, మీడియాను కూడా బోల్తా కొట్టించారు.ఎన్నికల వేళ బంజారా భవన్ ను ఏర్పాటుపై బంజారాలు నిలదీయడంతో స్పందించిన ఎమ్మెల్యే సోమవారం హాలియా కేంద్రంలో బంజారా భవన్ కు శంకుస్థాపన చేశారు.
కానీ,అది కేవలం ఎన్నికల డ్రామాలో భాగమని, శంకుబండను ఎడిటింగ్ చేసిన ఫోటోతో బంజార భవన్ శంకుస్థాపన చేసినట్టు కలరింగ్ ఇచ్చి, ప్రజలను,మీడియాను కూడా తప్పుదారి పట్టించారని యువజన కాంగ్రెస్ నాయకులు ఆరోపిస్తున్నారు.మంగళవారం ఉదయం యువజన కాంగ్రెస్ నాయకులు శిలాపలకాన్ని సందర్శించగా అక్కడ శిలా పలకం లేకపోవడంతో అవాక్కయ్యారు.
ఎడిటింగ్ చేసిన ఫోటోతో బంజార భవన్ కి శంకుస్థాపన చేయడం ఏంటని ఎమ్మెల్యే భగత్ ను ప్రశ్నించారు.చేతకాకపొతే బంజారా బిడ్డలకు క్షమాపణ చెప్పాలి కానీ,ఎమ్మెల్యే స్థాయిలో ఇలా చేయడం సిగ్గుచేటన్నారు.
ఉప ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీని ఎమ్మెల్యే అమలు చేయకపోవడంతో నియోజకవర్గ ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారని,ఎమ్మెల్యే భగత్ స్థానికుడు కాకపోవడంతో నాగార్జున సాగర్ నియోజకవర్గంపై సవతి తల్లి ప్రేమ చూపిస్తున్నాడని, త్వరలోనే ఆయనని సొంత ఊరికి పంపడం ఖాయమని సొంత పార్టీ నేతలే బహిరంగంగా ఆరోపణలు చేస్తున్నారని గుర్తు చేశారు.