నల్లగొండ జిల్లా:మిర్యాలగూడ పట్టణంలోని శ్రీనివాసరాజు ప్రైవేట్ ఆర్థోపెడిక్ హాస్పిటల్ ( Private Orthopedic Hospital )లో చికిత్స పొందుతూ మీనాక్షి( Meenakshi ) (9) అనే బాలిక శుక్రవారం మృతి చెందిన ఘటనపై కుటుంబ సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.డాక్టర్ నిర్లక్షమే కారణమని హాస్పిటల్ ఎదుట మృతురాలి బంధువులు ఆందోళన దిగారు.
ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వారితో మాట్లాడి తగిన న్యాయం చేస్తామని భరోసా ఇవ్వడంతో బాలిక మృతదేహాన్ని అక్కడి నుంచి తరలించారు.