కానిస్టేబుల్ నియామక ప్రక్రియకు లైన్ క్లియర్...!

నల్లగొండ జిల్లా: తెలంగాణలో కానిస్టేబుల్ స్థాయి ఉద్యోగాల నియామక ప్రక్రియకు ఎట్టకేలకు లైన్ క్లియర్ అయింది.ఎంపికైన అభ్యర్థులకు నియామక పత్రాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు అందజేయనున్నారు.

 Line Clear For Telangana Constable Recruitment Process, Telangana Constable Rec-TeluguStop.com

ఎల్బీ స్టేడియంలో జరిగే ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ నియామక పత్రాలను అందజేస్తారని తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు అధికారులు వెల్లడించారు.

తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ ఏప్రిల్ 2022లో నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే.

గత ఏడాది అక్టోబర్లో తుది ఎంపిక జాబితాను ప్రకటించారు.పోలీస్, జైళ్లు, ఎక్సైజ్, అగ్నిమాపక, రవాణా, స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ (ఎస్పీఎఫ్) విభాగాలకు సంబంధించిన 16,604 పోస్టులకు 12,866 మంది పురుషులు,2884 మంది మహిళా అభ్యర్థులు ఎంపికయ్యారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube