రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు జబర్దస్త్ ప్రియాంక సింగ్ ( Priyanka Singh )గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.జబర్దస్త్ షో ( Jabardasth Show )ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న ప్రియాంక సింగ్ ఆ తర్వాత బిగ్ బాస్ షో కి ఎంట్రీ ఇచ్చి ప్రేక్షకులకు మరింత చేరుఅవ్వడంతో పాటు విపరీతమైన పాపులారిటీని సంపాదించుకుంది.
బిగ్ బాస్ తర్వాత టీవీ షోలు, సినిమా ఛాన్సులతో బిజీగానే ఉంది ప్రియాంక సింగ్.బిగ్ బాస్ హౌస్( Bigg Boss House ) లో ఉన్నప్పుడే తన కష్టాలు చెప్పింది ప్రియాంక.
చిన్నప్పట్నుంచి పడ్డ కష్టాలు, వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా దూరం పెట్టారని ఎమోషనల్ అయింది.కానీ హౌస్ లోకి వెళ్ళాక వాళ్ళ అమ్మ, నాన్న వచ్చి మళ్ళీ దగ్గరకు తీసుకోవడంతో ప్రియాంక ఎమోషనల్ అయింది.

ఇక ప్రస్తుతం ఒక యూట్యూబ్ ఛానల్ ని రన్ చేస్తూ తనకు సంబంధించిన ప్రతి ఒక్క విషయాన్ని అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది.ఇది ఇలా ఉంటే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ప్రియాంక సింగ్ తన వ్యక్తిగత విషయాల గురించి తన జీవితంలో ఎదురైన చేదు అనుభవాల గురించి చెప్పుకొచ్చింది.ఈ సందర్భంగా ప్రియాంక సింగ్ మాట్లాడుతూ.నేను అమ్మాయిగా మారకముందు నా అసలు పేరు తేజ్ బహదూర్ సింగ్( Tej Bahadur Singh ) .కానీ నాలో అమ్మాయిల లక్షణాలు ఉండటంతో అమ్మాయిగా మారాలనుకున్నాను.ఇక అమ్మాయిగా మారాలి అంటే హార్మోన్ థెరపీ చేయించుకోవాలి.
అందుకే అలా చేయించుకున్నాను అని తెలిపింది ప్రియాంక సింగ్.అలాగే ఇండస్ట్రీలోకి వచ్చాక అవకాశాల కోసం ఇలా మారిపోయావా అని చాలామంది అన్నారు.

ఒకరిద్దరు నీతో ఉండాలని ఉంది, నైట్ కి ఎంత ఛార్జ్ చేస్తావు అని అడిగారు.ఇండస్ట్రీలో కొంతమంది చిన్నచూపు చూశారు అని చెబుతూ ఎమోషనల్ అయ్యింది.ఇక సోషల్ మీడియాలో ఈ మధ్య బూతు ఎక్కువైపోయింది, చాలామంది కామెంట్స్ చేస్తారు, అవి పట్టించుకోకూడదు, ఒకరు లైన్ దాటి మరీ కామెంట్స్ చేశారు.దేనికైనా ఒక హద్దు ఉంటుంది.
అది దాటితే ఓపిక చచ్చిపోతుంది.అందుకే ఇన్‌స్టాగ్రామ్ లో సీరియస్ అయ్యాను అని చెప్పుకొచ్చింది ప్రియాంక సింగ్.
అలాగే మొదట్లో ఊళ్ళో వాళ్ళు అనే మాటలే మా ఇంట్లో వాళ్ళు కూడా అన్నారు.దాంతో ఒంటి మీద కిరోసిన్ పోసుకొని కాల్చుకున్నాను.
మూడు సార్లు చావాలనుకున్నాను, కానీ మూడు సార్లు బతికి బయటపడ్డాను అంటే ఏదో సాధించాలనే అర్థమైంది.అందుకే ఇలా కష్టపడుతున్నాను అని తెలిపింది ప్రియాంక సింగ్.
ఈ సందర్భంగా ప్రియాంక సింగ్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.అందుకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.







