నల్లగొండ జిల్లా:రెండు దశాబ్ధాలుగా తెలంగాణ జిల్లాల కార్మికులు ఎదురుచూస్తున్న ఈఎస్‌ఐసీ సేవలు త్వరలో అందుబాటులోకి తెచ్చేందుకు ఈఎస్‌ఐసీ
డిస్పెన్సరీ ఏర్పాటుకు అడుగులు పడ్డాయి.రాష్ట్రంలో హనుమకొండ, మెదక్,రంగారెడ్డి,కరీంనగర్, వరంగల్,
సూర్యాపేట జిల్లాలో వీటి ఏర్పాటుకు అనుమతించింది.
రాష్ట్రంలో కొత్తగా 20 డిస్పెన్సరీలు అవసరమని అధికారులు ప్రాథమికంగా గుర్తించారు.అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు సమర్పించాక ఆర్థిక శాఖ అనుమతితో త్వరలో జీవో జారీ కానుంది.