మూడు రోజుల పాటు ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమం నిర్వహించాలి:కలెక్టర్

నల్లగొండ జిల్లా:జిల్లాలోని అన్ని మున్సిపాలిటీలు, గ్రామపంచాయతీలలో రానున్న 3 రోజులపాటు ప్రత్యేక పారిశుధ్య డ్రైవ్ నిర్వహించాలని జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి( District Collector C Narayana Reddy ) ఆదేశించారు.

 Special Sanitation Program To Be Conducted For Three Days: Collector , District-TeluguStop.com

శనివారం ఆయన జిల్లా అధికారులు, మండలాల ప్రత్యేక అధికారులు, గ్రామపంచాయతీ ప్రత్యేక అధికారులతో గ్రామాలలో స్పెషల్ సానిటేషన్ డ్రైవ్ పై టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు.గ్రామపంచాయతీ ఆవరణ తోపాటు,ఇతర ప్రభుత్వ సంస్థలు,రహదారులకు ఇరువైపులా పిచ్చి మొక్కలు లేకుండా తొలగించాలని,చెత్తా, చెదారాన్ని తీసివేయాలని ఇందుకుగాను గడ్డి, పిచ్చిమొక్కలు తొలగించేందుకు గ్రామ పంచాయతీల వారిగా గడ్డి కొత యంత్రాలు కొనుగోలు చేయాలని ఆదేశించారు.

గ్రామాలలో ఎక్కడ మురికి కాలువలు నిండిపోకుండా చెత్తా,చెదారం అడ్డు రాకుండా తొలగించాలని, ప్రతి ప్రభుత్వ సంస్థ ఆవరణలో శుభ్రంగా ఉండేలా చూడాలన్నారు.

అన్ని కార్యాలయాలలో తాగునీటిని ఏర్పాటు చేయడమే కాకుండా మరుగుదొడ్లు శుభ్రంగా ఉంచాలని,అవన్నీ పనిచేసే పరిస్థితికి తీసుకురావాలని,ఎక్కడైనా విద్యుత్ వైర్లు( Electrical wires ) తెగిపోయినా,వేలాడుతున్నా సరిచేయాలన్నారు.

బుధవారం వరకు అన్ని గ్రామాలలో స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ నిర్వహించి శుభ్రంగా ఉంచాలని,గురువారం ప్రజావాణి తర్వాత వీటిని తనిఖీ చేయడం జరుగుతుందని చెప్పారు.జిల్లాస్థాయిలో అన్ని కార్యాలయాల ఆవరణలను శుభ్రం చేసే కార్యక్రమాన్ని ఇదివరకే చేపట్టడం జరిగిందని, సోమవారం జిల్లా స్థాయి ప్రజావాణి తర్వాత మధ్యాహ్నం మూడు గంటల నుండి నాలుగు గంటల వరకు అన్ని కార్యాలయాలను ఇన్చార్జి అధికారులు తనిఖీ చేయడం జరుగుతుందని వెల్లడించారు.

ఎక్కడైనా చెత్తా,చెదారం కనిపించినా,కార్యాలయ ఆవరణలో పరిశుభ్రంగా లేనట్లయితే సంబంధిత జిల్లా అధికారులే బాధ్యత వహించవలసి ఉంటుందని తెలిపారు.సోమవారం మండల స్థాయిలో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమానికి ఈ సోమవారం సైతం గ్రామపంచాయతీ కార్యదర్శులు హాజరుకావాలని ఆదేశించారు.

మండల స్థాయి ప్రజావాణి కార్యక్రమంలో ఒక్కో గ్రామపంచాయతీ వారిగా సమగ్రంగా సమీక్ష చేయాలని ఎంపీడీవోలను ఆదేశించారు.అనంతరం మండల స్థాయిలో కో-ఆర్డినేషన్ సమావేశాన్ని నిర్వహించాలని చెప్పారు.

ప్రజావాణి ఫిర్యాదులను పరిష్కరించడమే కాకుండా ఆన్లైన్లో సైతం పరిష్కరించాలని సూచించారు.స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ టి.పూర్ణచంద్ర,అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్,జిల్లా అధికారులు,మండలాల ప్రత్యేక అధికారులు, తదితరులు టెలికాన్ఫరెన్సు కు హాజరయ్యారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube