నల్లగొండ జిల్లా:మాజీ సిఎం,గులాబీ బాస్ కేసీఆర్ జిల్లా పర్యటన మిర్యాలగూడ రోడ్ షో ద్వారానే ప్రారంభం అవుతుందని మిర్యాలగూడ మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు అన్నారు.ఆదివారం నల్లగొండ జిల్లా మిర్యాలగూడలోని బీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన నియోజకవర్గ,మండల ముఖ్య నాయకుల, కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ లోక్‌సభ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ఏప్రిల్ 24న మిర్యాలగూడెలో రోడ్డు షో ద్వారా జిల్లా పర్యటన ఉంటుందని తెలిపారు.
పార్టీ నాయకులు,కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని మాజీ ముఖ్యమంత్రి పర్యటనను విజయవంతం చేయాలని శ్రేణులకు పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో దామరచర్ల జడ్పీటీసీ అంగోతు లలిత హాతీరాం,జిల్లా డిసిఎంఎస్ ఛైర్మన్ దుర్గంపూడి నారాయణరెడ్డి, అడవిదేవులపల్లి ఎంపిపి బాలాజీ నాయక్, వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ ఛైర్మన్ బైరం సంపత్,మాజీ వైస్ ఛైర్మన్ కుందూరు వీరకోటిరెడ్డి, నాయకులు జొన్నలగడ్డ రంగారెడ్డి,పడిగాపాటి పెదకోటిరెడ్డి,కొత్త మర్రెడ్డి, భీమానాయక్,కుర్ర శ్రీను నాయక్,వీర నాయక్ తదితరులు పాల్గొన్నారు.