నల్లగొండ జిల్లా:లోక్‌సభ ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో తెలంగాణలో 48గంటల పాటు వైన్స్‌లు మూతపడనున్నాయి.పార్లమెంటు ఎన్నికలలో భాగంగా నాల్గవ విడతగా ఈ నెల 13న తెలంగాణ( Telangana )లో లోక్‌సభ ఎన్నికల పోలింగ్ జరుగనుంది.
ఎన్నికల కోడ్ అనుసరించి పోలింగ్‌కు ముందు అంటే మే 11వ తేదీ సాయంత్రం 6గంటల నుంచి మే 13వ తేదీ 6గంటల వరకు రాష్ట్ర వ్యాప్తంగా వైన్స్ షాప్‌లు మూసివేయాలని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ ఆదేశాలు జారీ చేసింది.
అలాగే కౌంటింగ్ రోజు జూన్ 4వ తేదీన కూడా వైన్స్ షాప్( Wine shops)లు మూసివేయాల్సివుంటుందని ఉత్తర్వుల్లో పేర్కోంది.
పోలింగ్ సందర్భంగా వరుసగా రెండు రోజులు మద్యం దుకాణాల బంద్ ఉండనుండటంతో మందుబాబులు ముందస్తుగా మద్యం కొనుగోలు కోసం వైన్స్‌ల వద్దకు పరుగులు తీస్తున్నారు.ముఖ్యంగా వేసవిలో చల్లని బీర్లు తాగాలనుకునేవారు ముందుగానే బీర్లు కొనుగోలు చేసుకుని ఫ్రిజులలో నిల్వ చేసుకుంటున్నారు
.