మృత్యు మార్గంగా చిట్యాల హైవే జంక్షన్

నల్లగొండ జిల్లా:చిట్యాల మున్సిపల్ కేంద్రం( Chityal Municipality )లో పోలీస్ స్టేషన్ ఎదురుగా 65వ,జాతీయ రహదారిపైన గల జంక్షన్ లో ట్రాఫిక్ నిబంధనలు లేక ప్రమాదాలకు కేరాఫ్ అడ్రస్ గా మారింది.నిత్యం రద్దీగా ఉండే ఈ ప్రాంతంలో ఒకవైపు అటుఇటు వెళ్ళే వాహనాలు,పాదచారులు, మరోవైపు హై వే నుండి అతివేగంగా వచ్చే వాహనాల జోరుతో ఈ జంక్షన్ మృత్యు ఘంటికలు మోగిస్తోంది.

 Chityala Highway Junction As A Way Of Death Chityal Municipality , Traffic , Nal-TeluguStop.com

ప్రతిరోజూ ప్రజలు, విద్యార్థులు, వాహనదారులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బిక్కుబిక్కుమంటూ జంక్షన్ లో ప్రయాణం చేస్తున్నారు.నిత్యం రోడ్డు ప్రమాదాలతో ఈ జంక్షన్ మృత్యువు మార్గంగా మారడంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఈ సందర్భంగా సిఐటియు నేత బోయిన శ్రీనివాస్ యాదవ్( Boina Srinivas Yadav ) మాట్లాడుతూ ఈ జంక్షన్ అత్యంత ప్రమాదకమైనది.ఆదివారం అరగంట వ్యవధిలోనే రెండు యాక్సిడెంట్లు జరిగాయి.

ఇంజనీర్ల వైఫల్యం, నాయకుల లాలూచీ, వ్యాపారుల కక్కుర్తి మూలంగా రోడ్డు నిర్మాణం అస్తవ్యస్తంగా జరిగింది.దీనివల్ల రోజు ఏదోక ప్రమాదం జరిగి ప్రాణనష్టం జరుగుతుంది.

సంబంధిత అధికారులు ఈ సమస్యపైన స్పందించి ట్రాఫిక్ నియంత్రణ కోసం ప్రత్యేక చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube