ఎన్ని ఏళ్ళు గడిచిన వయసు పెరగని హీరో .. అయన గురించి ఎంత చెప్పిన తక్కువే !

స్వాతి కిరణం సినిమా విడుదల అయినా రోజుల్లో అందరు మమ్ముట్టి ని చూసి మంచి నటుడు అని అనుకున్నారు.ఎందుకంటే తెలుగు ప్రేక్షకులకు అయన అప్పుడే బాగా పరిచయం అయ్యారు.

 Facts About Hero Mammootty, Hero Mammootty , Dalapati Movie, Swati Kiranam Movie-TeluguStop.com

ఆ సినిమాలో పెద్ద వయసు వ్యక్తిగా నటించిన కూడా మొహం పై ఎక్కడ ముడతలు కనిపించవు కానీ మీసాలు , వెంట్రుకలు మాత్రం తెల్లగా కనిపిస్తాయి.ఆ తర్వాత దళపతి సినిమా తమిళ్ లో సూపర్ హిట్ అయ్యి తెలుగు లో సైతం రీమేక్ అయ్యింది.

ఆ సినిమాలో రజినీకాంత్ కి మిత్రుడిగా మమ్ముట్టి అద్భుతంగా నటించాడు.ఒకానొక సమయంలో రజిని ని సైతం మమ్ముట్టి బీట్ చేసాడు.

ఇక ప్రపంచ సుందరి ఐశ్వర్య రాయ్ కి జోడిగా వచ్చిన సినిమా ప్రియురాలు పిలిచింది.ఈ సినిమాలో ఆర్మీ లో పని చేసి కాలు పోగొట్టుకొని సినిమా అంత కుంటుతూనే నటిస్తారు.

ఈ సినిమా తర్వాత చాల మంది అమ్మాయిలు మమ్ముట్టి తో ప్రేమలో పడిపోయారు.ఇప్పటి జెనరేషన్ వాళ్ళు ఈ సినిమా చూడకపోతే ఖచ్చితంగా ఓసారి సమయం తీసుకొని చూడండి.

మమ్ముట్టి కోసం అయినా ఈ సినిమా తప్పకుండ చూడాలి.ఇక ఈ మధ్య కాలంలో మరోసారి నేరుగా తెలుగు ప్రేక్షకులను పలకరించిన సినిమా యాత్ర.

వైస్ రాజ శేఖర్ రెడ్డి బయోపిక్ లో మెయిన్ లీడ్ గా నటించారు.

Telugu Mammootty, Dalapati, Muhammadkutty, Swati Kiranam, Tamil-Telugu Stop Excl

ఈ సినిమాను రాజశేఖర్ రెడ్డి కోసం చుసిన వాళ్ళు కొందరు అయితే మమ్ముట్టి కోసం చుసిన వాళ్ళు మరి కొందరు.అయన గొంతులోంచి వచ్చే ఒక్కో మాట ప్రేక్షకుడ్ని కట్టిపడేశాయి.బయోపిక్ సినిమాలో జీవం ఉట్టిపడే విధంగా నటించాడు మమ్ముట్టి.

ఇక ఈ మధ్య కాలంలో చాల మంది అమ్మాయిలు మహానటి, సీత రామం సినిమా చూసి అయన కుమారుడు దుల్కర్ సల్మాన్ తో ప్రేమలో పడుతున్నారు.దుల్కర్ ని, మమ్ముట్టి ని పక్క పక్కన పెడితే తండ్రి కొడుకులు అని ఎవ్వరు అనుకోరు.

అన్నదమ్ములు అని పొరపడే అవకాశం ఉంది.ఇక ఇప్పుడు మమ్ముట్టి వయసు 70 ఏళ్ళు.

అయన అసలు పేరు ముహమ్మద్ కుట్టి ఇస్మాయిల్ పెనిపరంబిల్.ఇంకా ఎన్నో ఏళ్ళు సినిమాల్లో నటిస్తూ ఇంతే అందంగా, ఆరోగ్యంగా ఉండాలని కోరుకుందాం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube