వర్షా కాలంలో చేపట్ట వలసిన ముందస్తు చర్యలపై సదస్సు

నల్గొండ జిల్లా: రానున్న వర్షా కాలంలో మున్సిపల్ పరిధిలో ఎలాంటి ప్రాణ, ఆస్థి నష్టాలు జరగకుండా అధికారులు ముందస్తు చర్యలు తీసుకోవాలని మున్సిపల్ అసిస్టెంట్ కమిషనర్ మసాజ్ హైమద్ అధికారులను ఆదేశించారు.శుక్రవారం నల్గొండ మున్సిపల్ ఆఫీసులో ఇంజనీరింగ్ శాఖ,వివిధ వార్డు అధికారులతో ఏర్పాటు చేసిన వీడియో కాన్ఫరెన్స్ సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రాబోయే వర్షా కాలం ముందస్తుగా చేపట్టే చర్యలపై పలు సూచనలు చేశారు.

 Conference On Pre-emptive Measures To Be Taken During Rainy Season In Nalgonda D-TeluguStop.com

పట్టణంలో ఉన్న రెండు మీటర్ల లోపు,ఆపై ఉన్న కాలువలకు సంబంధించి ఏలాంటి చర్యలు తీసుకోవాలనే విషయంపై చర్చించారు.అదే విధంగా నీటి కుంటలు,కూలడానికి సిద్దంగా ఉన్న నిర్మాణాల తొలగింపు,నిర్మానుష్య ప్రాంతాలు గుర్తించి తొలగించాలన్నారు.

అభివృద్ధి పనులు జరుగుతున్న ప్రాంతాలలో సూచిక బోర్డులను ఏర్పాటు చేయాలని అధికారలకు సూచించారు.డిజాస్టర్,ఏమర్జెన్సి టీమ్స్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలన్నారు.ఈ సమావేశంలో మున్సిపల్ శాఖ డీఈ, ఈఈ,వార్డు అధికారులు సిబ్బంది తదతరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube