తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఉమ్మడి నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి షాక్ తగిలింది.కీలక నేతగా ఉన్న చెరుకు సుధాకర్ పార్టీకి రాజీనామా చేశారని తెలుస్తోంది.
సీనియర్ నేత, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తీరుతోనే తాను పార్టీని వీడుతున్నట్లు చెరుకు సుధాకర్ ప్రకటించారు.ఈ క్రమంలోనే టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి ఆయన బహిరంగ లేఖ రాశారు.
కాంగ్రెస్ పార్టీలో సామాజిక న్యాయం లేదని, టికెట్ల కేటాయింపులో బీసీలకు అన్యాయం చేస్తున్నారన్నారు.తన రాజీనామాకు కోమటిరెడ్డి ఒంటెద్దు పోకడ కూడా కారణమని చెరుకు సుధాకర్ లేఖలో పేర్కొన్నారు.
అయితే నకిరేకల్ నియోజకవర్గ టికెట్ విషయంలో ఆయన పార్టీపై అసంతృప్తిగా ఉన్న సంగతి తెలిసిందే.