జుట్టును ఇంట్లోనే స్మూత్ అండ్ స్ట్రాంగ్ గా మార్చుకోవాలనుందా? అయితే మీకోసమే ఈ రెమెడీ!

జుట్టును ఇంట్లోనే స్మూత్ అండ్ స్ట్రాంగ్ గా మార్చుకోవాలని అనుకుంటున్నారా? అసలు అది సాధ్యమేనా? అంటే సాధ్యమే.అందుకు ఇప్పుడు చెప్పబోయే మ్యాజికల్ రెమెడీ చాలా అద్భుతంగా సహాయపడుతుంది.

 A Remedy That Makes Hair Smooth And Strong Is For You, Smooth Hair, Strong Hair,-TeluguStop.com

ఈ రెమెడీని వారంలో కేవలం రెండు సార్లు పాటిస్తే కనుక మీ జుట్టు కుదుళ్లు సహజంగానే బలపడతాయి.దాంతో హెయిర్ ఫాల్, హెయిర్ డ్యామేజ్( Hair fall, hair damage ) వంటి సమస్యలు దూరం అవుతాయి.

అలాగే ఈ రెమెడీని పాటించడం వల్ల జుట్టు స్మూత్ అండ్ సిల్కీగా సైతం మారుతుంది.మరి ఇంకెందుకు ఆలస్యం ఆ రెమెడీ ఏంటో చూపు చూసేయండి.

ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని అందులో ఒక గ్లాస్ వాటర్ పోయాలి.వాటర్ హీట్ అవ్వగానే అందులో రెండు టేబుల్ స్పూన్లు అవిసె గింజలు( Flax seeds ), రెండు టేబుల్ స్పూన్లు నువ్వులు ( Sesame seeds )వేసి పది నుంచి ప‌న్నెండు నిమిషాల పాటు ఉడికించాలి.

ఆ తర్వాత ఉడికించిన పదార్థాలను మిక్సీ జార్ లో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమం నుంచి స్మూత్ క్రీమ్ ను సపరేట్ చేసుకోవాలి.

ఈ క్రీమ్ లో వన్ టేబుల్ స్పూన్ విటమిన్ ఈ ఆయిల్, వన్ టేబుల్ స్పూన్ ఆలివ్ ఆయిల్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి.ఈ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు పట్టించి షవర్ క్యాప్ ధరించాలి.గంటన్నర లేదా రెండు గంటల అనంతరం మైల్డ్ షాంపూను ఉపయోగించి శుభ్రంగా తల స్నానం చేయాలి.

వారంలో రెండే రెండు సార్లు రెమెడీని కనుక పాటిస్తే జుట్టు కుదుళ్ళు స్ట్రాంగ్ గా మారతాయి.దాంతో జుట్టు రాలడం, విరగడం, చిట్లడం వంటివి తగ్గుతాయి.అదే సమయంలో మీ జుట్టు స్మూత్ గా సిల్కీగా సైతం మెరుస్తుంది.

కాబట్టి ఇంట్లోనే జుట్టును స్మూత్ అండ్ స్ట్రాంగ్ గా మార్చుకోవాలి అనుకునేవారు తప్పకుండా ఈ రెమెడీని పాటించండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube