మా ఊరు ఎందుకొచ్చావ్‌? పార్టీ ఎందుకు మారావ్‌?

నల్లగొండ జిల్లా:కాంగ్రెస్‌ను వీడి బీజేపీలో ఎందుకు చేరావ్‌?పార్టీ మారి మా గ్రామానికి ఎందుకొచ్చావ్? అంటూ మునుగోడు తాజా మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డిని కాంగ్రెస్‌ కార్యకర్తలు నిలదీశారు.ఈ పరిణామంతో రాజగోపాల్‌రెడ్డి షాక్‌ కు గురయ్యారు.

 Why Did You Come To Our Town? Why Did You Change The Party?-TeluguStop.com

ఈ సంఘటన నల్లగొండ జిల్లా నాంపల్లి మండలంలోని తుంగపాడు గ్రామంలో బుధవారం చోటుచేసుకుంది.గ్రామంలోని వివిధ పార్టీలకు చెందిన నాయకులు,కార్యకర్తలు కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి సమక్షంలో బీజేపీలో చేరుతున్న నేపథ్యంలో ఆయన గ్రామానికి వెళ్లారు.

అనంతరం రాజగోపాల్‌రెడ్డి కార్యకర్తలనుద్దేశించి ప్రసంగిస్తున్న సమయంలో వివాదం మరింత ముదిరింది.సమీపంలోనే ఉన్న వినాయక మండపం వద్ద కొంతమంది కాంగ్రెస్‌ కార్యకర్తలు పెద్ద సౌండ్‌తో రేవంత్‌రెడ్డి పాట పెట్టారు.

దీంతో సౌండ్‌ తగ్గించాలని బీజేపీ కార్యకర్తలు కోరారు.కాంగ్రెస్‌ వారు రెట్టింపు సౌండ్‌తో పాట పెట్టడంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది.

పలువురు కాంగ్రెస్‌ కార్యకర్తలు పార్టీ ఎందుకు మారావంటూ రాజగోపాల్‌రెడ్డిని నిలదీశారు.పార్టీ మారిన వ్యక్తి గ్రామానికి రావడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు.

సమావేశంలో ప్రసంగించాలని రాజగోపాల్‌రెడ్డి ఎంత ప్రయత్నించినప్పటికీ కాంగ్రెస్‌ కార్యకర్తలు అడ్డుపడటంతో ఆయన అక్కడి నుండి వెళ్లిపోయారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube