తెలంగాణ జాతీయ సమైక్యతా ఉత్సవాల నిర్వహణ ఏర్పాట్లపై సీఎస్ సోమేశ్ కుమార్ సమీక్ష చేపట్టారు.ఈ నెల 16, 17, 18వ తేదీల్లో ఉత్సవాలను నిర్వహించనున్నారు.
దీనిలో భాగంగా బంజారాహిల్స్ లో నూతనంగా నిర్మించిన ఆదివాసీ, బంజారా భవనాలను సీఎం కేసీఆర్ ఈ నెల 17న ప్రారంభించనున్నారని తెలిపారు.
హైదరాబాద్‌తో పాటు జిల్లా కేంద్రాల్లో ఉత్సవాల నిర్వహణకు విస్తృత ఏర్పాట్లు చేయాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు.
హైదరాబాద్‌లోని పబ్లిక్ గార్డెన్‌లో సీఎం కేసీఆర్ జాతీయ జెండాను ఆవిష్కరించనున్నారు.అదేవిధంగా ఆదివాసీ, బంజారా భవనాలను ప్రారంభిస్తారని తెలిపారు.
అనంతరం నెక్లెస్ రోడ్డు నుంచి ఎన్టీఆర్ స్టేడియం వరకు గుస్సాడీ, గోండ్, లంబాడీ కళాకారులతో భారీ ర్యాలీ ఉంటుందని సీఎస్ పేర్కొన్నారు.







