ఘనంగా డా.బాబూ జగ్జీవన్ రామ్ 115 వ జయంతి వేడుకలు

నల్లగొండ జిల్లా:జిల్లా కేంద్రంలోని ఎన్.జి.

 Dr. Babu Jagjivan Ram's 115th Birth Anniversary Celebrations-TeluguStop.com

కాలేజ్ సమీపంలో వున్న బాబూ జగ్జీవన్ రామ్ విగ్రహానికి బహుజన్ సమాజ్ పార్టీ మునుగోడు నియోజికవర్గ ఇంచార్జ్ పెండెం ధనుంజయ్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్భంగా ఆయన ధనుంజయ్ మాట్లాడుతూ స్వాతంత్ర్య సమరయోధుడిగా,సంఘసంస్కర్తగా,తన పరిపాలనా దక్షతతో అఖండ భారతావనికి విశేష సేవలందించిన భారత మాజీ ఉప ప్రధాని బాబూ జగ్జీవన్ రామ్ అని,27 ఏళ్లకే ఎమ్మెల్యేగా గెలిచి,50 ఏళ్లు ఎంపీగా సేవలందించి ప్రపంచ రికార్డు పొందారని,30 ఏళ్లు కేంద్రమంత్రిగా దేశానికి సేవలందించి నిజాయితీకి నిలువెత్తు రూపంగా నిలిచారని కొనియాడారు.1971లో ఇండో-పాక్ యుద్ధం జరిగిన సమయంలో భారత రక్షణ మంత్రిగా ఉండి బంగ్లాదేశ్ ఏర్పాటులో కీలక పాత్ర పోషించారని,భారతదేశంలో హరిత విప్లవం ఆయన వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నప్పుడే జరిగిందని,ఎమర్జెన్సీ సమయంలో ఇందిరా గాంధీకి మద్దతు ఇచ్చినప్పటికీ తర్వాత జరిగిన పరిణామాలతో కాంగ్రెస్ తో విభేదించి జనతా పార్టీలో చేరి భారత ఉప ప్రధాని గా సేవలందించారని గుర్తు చేశారు.ఆయన కుమార్తె మీరా కుమారి లోక్ సభ స్పీకర్ గా పని చేసినప్పుడు తెలంగాణ బిల్లు కోసం ప్రత్యేకించి కృషి చేసినందున యావత్ తెలంగాణ జాతి వారి కుటుంబానికి రుణపడి ఉంటుందని తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కట్టెల శివ,సమాచార హక్కు ప్రజా చైతన్య సమితి రాష్ట్ర కార్యదర్శి యనమల్ల భాస్కర్,నల్గొండ జిల్లా ఇంఛార్జ్ మొహమ్మద్ నజీర్, గంజి వెంకన్న తదితరులు పాల్గొన్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube