జర్నలిస్ట్ భూ మాఫియాపై చర్యలకు రంగం సిద్దం...!

నల్లగొండ జిల్లా:నల్లగొండ రూరల్ మండలం (Nalgonda )పరిధిలోని గొల్లగూడ, పానగల్ ప్రాంతాల్లో 370, 371,148,149 సర్వే నెంబర్లలో 59 జీవోను అడ్డం పెట్టుకుని కొందరు జర్నలిస్టులు( Journalists ) సుమారు రూ.10 కోట్ల విలువ చేసే ప్రభుత్వ భూమిని కాజేసినట్లు అన్యాయానికి గురైన జర్నలిస్టులు కలెక్టర్ కి ఫిర్యాదు చేయడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది.అయినా గతంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీకి చెందిన ప్రజా ప్రతినిధులతో పాటు, కొందరు అధికారుల అండ కూడా ఉండడంతో ఎలాంటి చర్యలు తీసుకోలేదు.

 The Field Is Ready For Action Against Journalist Land Mafia , Nalgonda , Journal-TeluguStop.com

ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ( Congress party )అధికారంలోకి రాగానే అన్యాయానికి గురైన జర్నలిస్టులు మళ్ళీ ఈ భూ అక్రమాల బాగోతం తెరపైకి తెచ్చారు.దీనితో అధికార యంత్రాంగంలో చలనం వచ్చింది.59 జీవో అక్రమాలపై ఆరోపణలు ఎదుర్కొంటున్న జర్నలిస్టులు నారబోయిన క్రాంతి,ముప్పా రేవంత్ రెడ్డి,మారబోయిన మధుసూదన్,బోయినపల్లి రమేష్,పసుపులేటి కిరణ్ కుమార్,మామిళ్ళ రామానుజన్ రెడ్డి,బూర రాములు సరైన పత్రాలు తీసుకొని తేదీ:16/12/ 2023 ఉదయం 10:30 నిమిషాలకు విచారణకు హాజరు కావలసిందిగా నోటీసులు జారీ చేశారు.అలాగే వీరితో పాటు ఆర్డీవో నల్గొండ,మున్సిపల్ కమిషనర్ నల్గొండ, తహసిల్దార్ నల్గొండ, నల్గొండ మున్సిపాలిటీ, ఇతర సిబ్బంది కూడా హాజరు కావాలని నోటీసులో పేర్కొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube