నల్లగొండ జిల్లా: కొండమల్లేపల్లి( Kondamallepalli ) బాలికల గురుకుల పాఠశాలలో 9వ,తరగతి చదువుతున్న విద్యార్దిని సోమవారం అనుమానాస్పదంగా మృతి చెందిన సంఘటన జిల్లాలో కలకలం రేపింది.పాఠశాల యాజమాన్యం చెప్పేదానికి,మృతురాలి తల్లిదండ్రులు చేసే ఆరోపణలకు పొంతన లేకపోవడంతో గురుకులంలో అసలేం జరిగిందనే విషయం అందరినీ ఆలోచింప చేస్తుంది.
గురుకుల యాజమాన్యం కథనం ప్రకారం…కొండమల్లేపల్లి సాంఘిక సంక్షేమ గురుకుల ప్రభుత్వ బాలికల పాఠశాలలో దాసరి భార్గవి( Dasari Bhargavi ) 9వ తరగతిచదువుతుంది.
రోజు మాదిరిగానే సోమవారం కూడా ఉదయం అల్పాహారం అయిన తర్వాత ప్రార్థనలో నిలబడి ఉండగా అకస్మాత్తుగా కింద పడిపోయింది.
పక్క విద్యార్థినిలు,పిఈటి ఉపాధ్యాయులకు సమాచారం ఇవ్వడంతో స్థానిక ప్రైవేట్ హాస్పిటల్ తీసుకువెళ్లగా పరిస్థితి విషంంచడంతో దేవరకొండ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందిందని పాఠశాల ఉపాధ్యాయులు చెబుతున్నారు.
ఉపాధ్యాయులు( Teachers ) చెప్పేది నమ్మశక్యంగా లేదంటున్న తల్లిదండ్రులు.
గురుకుల ఉపాధ్యాయులు చెప్పేది అవాస్తవం.జరిగిన విషయాన్ని వక్రీకరించి చెబుతున్నారు.
వాస్తవాలను తమకు తెలియకుండా చేస్తున్నారు.ఇది ముమ్మాటికీ అనుమానస్పద మృతే.
ఉన్నతాధికారులు స్పందించి సమగ్ర విచారణ జరిపి,వాస్తవాలను బయటికి తీసి,తమకు న్యాయం చేయాలని విలపించారు.విద్యార్దిని మృతిపై విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ విద్యార్థి,సంఘాల ఆధ్వర్యంలో పెద్దఎత్తున ఆందోళన చేపట్టి, దేవరకొండ ఆసుపత్రి ముందు కోదాడ-జడ్చర్ల జాతీయ రహదారిపై ధర్నాకు దిగారు.
ఈ ధర్నాకు కుల,ప్రజా సంఘాల నాయకులు మద్దతు తెలిపారు.ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ భార్గవి మృతికి కారణమైన పాఠశాల యాజమాన్యంపైచర్యలు తీసుకోవాలని, అసలేం జరిగిందో నిజా నిజాలు నిగ్గుతేల్చి బాధ్యులను సస్పెండ్ చేయాలని,భార్గవి కుటుంబానికి రూ.20 లక్షలు ఎక్స్గ్రేషియా అందించాలని డిమాండ్ చేశారు.విద్యార్దిని కుటుంబానికి కుటుంబానికి తగిన విధంగా న్యాయం చేయకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు.
పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు విద్యార్దిని కుటుంబానికి తగిన న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.ఈ కార్యక్రమంలో టీఎస్ ఎంఆర్పీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ముదిగొండ ఎల్లేష్ మాదిగ,చందు నాయక్,ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు ఆకారం నరేష్,బుడిగ వెంకటేష్, వివిఆర్ వివిధ ప్రజాసంఘాల నాయకులు పాల్గొన్నారు.