నల్లగొండ జిల్లా:రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో నల్లగొండ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ప్రత్యర్థి ముఖ్యమంత్రి కేసీఆర్ అయినా తన గెలుపు ఖాయమని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ధీమా వ్యక్తం చేసినట్లు సమాచారం.ముఖ్యమంత్రి కేసీఆర్ నల్లగొండ నుంచి పోటీ చేస్తారని ప్రచారం జరుగుతుండటంతో ఎంపీ కోమటిరెడ్డి తన అనుచరులతో పైవిధంగా వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది.
నల్లగొండ నుంచి తన ప్రత్యర్థి ఎంతటి బలమైన వ్యక్తి అయినా తన గెలుపును ఎవరూ ఆపలేరని,బలమైన ప్రత్యర్థి ఉంటేనే పోరు బాగుంటుందని చెప్పినట్లు సమాచారం.