టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన ప్రభాస్ కు ప్రేక్షకుల్లో భారీస్థాయిలో క్రేజ్ ఉంది.ప్రభాస్ బాహుబలి2 తర్వాత సుజీత్, రాధాకృష్ణ కుమార్ లాంటి యంగ్ డైరెక్టర్లకు ఛాన్స్ ఇవ్వగా ఆ డైరెక్టర్లు ప్రభాస్ అభిమానులను తీవ్రస్థాయిలో నిరాశపరిచారు.
ప్రస్తుతం ప్రభాస్ నటిస్తున్న సలార్ సినిమా కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.ఈ సినిమా విజయాన్ని సొంతం చేసుకుని బ్లాక్ బస్టర్ హిట్ గా నిలుస్తుందని ఫ్యాన్స్ అనుకుంటున్నారు.
అయితే ప్రభాస్ కు ప్రముఖ దర్శకుడు లోకేశ్ కనగరాజ్ కథ చెప్పగా ప్రభాస్ మాత్రం లోకేష్ కనగరాజ్ చెప్పిన కథ నచ్చలేదని వెల్లడించారని సమచారం.రొటీన్ యాక్షన్ డ్రామాలలో నటించే ఉద్దేశం తనకు లేదని ప్రభాస్ తేల్చి చెప్పారని సమాచారం.
ఫ్యాన్స్ తన నుంచి కొత్త తరహా కథలను ఆశిస్తున్న నేపథ్యంలో ప్రభాస్ ఈ కామెంట్లు చేశారని తెలుస్తోంది.అయితే దర్శకుడిగా లోకేశ్ కనగారాజ్ కు ప్రత్యేక గుర్తింపు ఉంది.
ఖైదీ, మాస్టర్ సినిమాల విజయాలతో లోకేశ్ కనగరాజ్ దర్శకునిగా తన స్థాయిని పెంచుకున్నారు.అయితే ఈ కథను రిజెక్ట్ చేసినా లోకేశ్ కనగరాజ్ మరో మంచి కథతో ప్రభాస్ ను మెప్పిస్తే ఈ కాంబినేషన్ లో సినిమా వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి.
ప్రభాస్ లోకేశ్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా ఈ కాంబినేషన్ లో సినిమా మొదలవ్వాలంటే చాలా సమయం పట్టే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు.