నల్లగొండ జిల్లా:ప్రస్తుత పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లోనే ఎస్సీ వర్గీకరణ బిల్లు ప్రవేశపెట్టి చట్ట బద్దట కల్పించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 27, 28 తేదీలలో ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఎమ్మెస్పీ ఆధ్వర్యంలో మహాధర్నాలు నిర్వహిస్తామని ఎమ్మెస్పీ నల్లగొండ నియోజకవర్గ ఇంచార్జ్ బకరం శ్రీనివాస్ మాదిగ తెలిపారు.
శుక్రవారం జిల్లా కేంద్రంలోని ఆర్ అండ్ బి అతిథి గృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో వర్గీకరణ చేస్తామని నమ్మించి మోసం చేసిందన్నారు.
ఈ పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో ఎస్సీ వర్గీకరణ బిల్లు ప్రవేశపెట్టిచట్ట బడ్డత కల్పించకపోతేతెలంగాణ రాష్ట్రంలో బీజేపీని మాదిగ వాడల్లోకి రాకుండా అడ్డుకుంటామనిహెచ్చరించారు.ఛలో ఢిల్లీ కార్యక్రమానికి మాదిగలు భారీగా తరలి వచ్చి జయప్రదం చేయాలని పిలుపనిచ్చారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ఎమ్మెస్పీ నాయకులు పాల్గొన్నారు.