గురువారం రాత్రి సికింద్రాబాద్ స్వప్నలోక్ కాంప్లెక్స్( Swapnalok Complex ) అగ్ని ప్రమాద ఘటనలో ఆరుగురు మృతి చెందటం తెలిసిందే.ఆరుగురు కూడా ఊపిరాడక … మరణించినట్లు వాళ్లపై ఒక గాయం కూడా లేనట్లు వైద్యులు దృవీకరించడం జరిగింది.
నలుగురు మహిళలు.ఇద్దరు యువకులు ప్రాణాలు కోల్పోయారు.
అంతేకాదు మృతులంతా 20 నుంచి 24 ఏళ్లలోపు వారే కావటం గమనార్హం.అయితే ఈ ప్రమాద ఘటనపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మృతుల కుటుంబాలకు ₹5 లక్షల రూపాయలు ఎక్స్ గ్రేషియ ప్రకటించడం తెలిసిందే.

అయితే తాజాగా ఈ సికింద్రాబాద్( Secunderabad ) స్వప్నలోక్ అగ్ని ప్రమాదం ఘటనలో చనిపోయిన కుటుంబాలకు PMNRF నుంచి ₹2 లక్షల రూపాయలు ఎక్స్ గ్రేషియా ప్రధాని మోడీ( PM Modi ) ప్రకటించారు.ఇదే ఘటనలో గాయపడిన వారికి ₹50 వేల రూపాయలు కూడా ప్రకటించడం జరిగింది.మరోపక్క ఈ ప్రమాద ఘటనపై తెలంగాణ ప్రభుత్వం దృష్టి సారించింది.ఈ క్రమంలో జిహెచ్ఎంసి… స్వప్నలోక్ కాంప్లెక్స్ నిర్మాణం నిబంధనల ప్రకారమే.నిర్మించడం జరిగిందో లేదో ఇంకా… భవనం నాణ్యతను పరిశీలించే బాధ్యతను జేఎన్టీయూకీ అప్పజెప్పడం జరిగింది.ఈ క్రమంలో నివేదిక వచ్చేవరకు.
కాంప్లెక్స్ తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు GHMC స్పష్టం చేసింది.







