ముఖ్యంగా చెప్పాలంటే ప్రస్తుత సమాజంలో దాదాపు చాలా మంది ప్రజలు ఏదో ఒక అనారోగ్య సమస్యతో ఇబ్బంది పడుతున్నారు.అలాగే ఇలాంటి అనారోగ్య సమస్యలు ఉన్న వారు కచ్చితంగా కొన్ని ఆరోగ్యపరమైన జాగ్రత్తలు తీసుకోవాలి.
లేదంటే వీరి ఆరోగ్యం పై చెడు ప్రభావం పడుతుంది.అలాగే ఆస్తమా ఉన్న వారు ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని వైద్యులు చెబుతున్నారు.
ముఖ్యంగా సీజన్ మారుతున్నప్పుడు శీతాకాలంలో జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతున్నారు.లేకపోతే వీరిలో శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలుగుతుంది.
ఇంకా చెప్పాలంటే విపరీతమైన దగ్గు, ఛాతిలో నొప్పి వంటి తీవ్రమైన సమస్యలను వీరు ఎదుర్కోవాల్సి వస్తుంది.ముఖ్యంగా చెప్పాలంటే ఎండా కాలంలో ఆస్తమా తో ( Asthma ) బాధపడుతున్న వారు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
ఎండా కాలంలో( Summer ) మీరు ఎక్కువగా బయట తిరగడం అస్సలు మంచిది కాదు.అలాగే దుమ్ము ధూళి( Dust ) కారణంగా ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
అందువల్ల మాస్క్ వేసుకొని బయటకు వెళ్లడం మంచిదని వైద్యులు చెబుతున్నారు.

ఆస్తమా పేషెంట్స్ వేసవి కాలంలో ఎండలు విపరీతంగా ఉన్నాయని ఫ్రిజ్లోని వాటర్ ని( Fridge Water ) ఇష్టపడుతుంటారు.కానీ ఫ్రిడ్జ్ లో వాటర్ వీరు అస్సలు తీసుకోకూడదు.వీలైతే మట్టి కుండలోని నీరు తాగడం వీరి ఆరోగ్యానికి ఎంతో మంచిది.
ఇన్హేలర్‌ను( Inhaler ) చాలా జాగ్రత్తగా ఎలాంటి డస్టు లేకుండా ఎప్పుడూ దగ్గరగా ఉంచుకోవడం మంచిది.అలాగే ఎండా కాలంలో ఎప్పుడు నీరు తాగుతూ ఉండాలి.డీహైడ్రేషన్ బారిన అసలు పడకూడదు.ఆస్తమా రోగులు ఎక్కువగా ఎండలో తిరగకూడదు.
ఎందుకంటే ఒక వేళ ఎండ దెబ్బకు గురైతే చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది.

అలాగే శ్వాస తీసుకోవడంలో తీవ్ర ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉంటుంది.అలాగే ప్రతి రోజు పండ్లు( Fruits ) తినడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మంచిది.ఇంకా చెప్పాలంటే స్పైసి ఫుడ్ కు వీలైనంత వరకు దూరంగా ఉండడం మంచిది.
ముఖ్యంగా మద్యం, సిగరెట్ వంటి వాటికి చాలా దూరంగా ఉండాలి.