నల్లగొండ జిల్లా:తిరుమలగిరి (సాగర్) మండల కేంద్రానికి చెందిన ఇరిగి శ్రీను ఇటీవల మరణించిన విషయం తెలిసి ప్రజాసేవకుడు పగడాల సైదులు బుధవారం మృతుని కుటుంబాన్ని పరామర్శించి సంతాపం వ్యక్తం చేశారు.మృతుడుకి ముగ్గురు ఆడపిల్లలని తెలిసి మృతుని భార్య ఇరిగి పీరమ్మకు పదివేల రూపాయల ఆర్థిక సహాయం చేశారు.
ఎవరికి ఏ కష్టం వచ్చినా వారికి అండగా ఉంటానని,పేద ప్రజల,కష్టసుఖాలలో పాలు పంచుకుంటూ,ఆర్థిక సహాయం చేస్తూ వారి కుటుంబాలకు పెద్దన్నగా,ఉంటానని తెలిపారు.కార్యక్రమంలో శ్రీను,సైదయ్య, నాగయ్య,అంజయ్య, పురుషోత్తం తదితరులు పాల్గొన్నారు.