నల్లగొండ జిల్లా: తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ (2022-23)లో యువజన,విద్యా రంగాలకు నిధులు కేటాయించకపోవడాన్ని నిరసిస్తూ మిర్యాలగూడ పట్టణంలో ఎస్ఎఫ్ఐ,డీవైఎఫ్ఐ ఆధ్వర్యంలో బడ్జెట్ ప్రతులను దగ్దం చేశారు.ఈ సందర్భంగా విద్యార్థి, యువజన నేతలు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న బడ్జెట్ సమావేశాల్లో ప్రవేశపెట్టిన బడ్జెట్ లో యువజన,విద్యా రంగాలకు సరైన నిధులు కేటాయించక పోవడం దారుణమన్నారు.
విద్యార్థులను,యువజనులను నిర్వీర్యం చేసేందుకు ప్రభుత్వం కుట్ర చేస్తుందని అర్ధమవుతుందని తెలిపారు.రాష్ట్రానికి ప్రధాన మానవ వనరు యువజనులు,విద్యార్థులే నన్న విషయం మరిచిపోయారా అని ప్రశ్నించారు.
ఈ కార్యక్రమంలో డీవైఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు రవినాయక్,రాష్ట్ర కమిటీ సభ్యుడు పతాని శ్రీను,జిల్లా నాయకులు వినోద్ నాయక్,గూడ నాగేంద్రప్రసాద్,ఎస్ఎఫ్ఐ నాయకులు జగన్,వంశీ తదితరులు పాల్గొన్నారు.