అనసూయ.ఈ పేరును పెద్దగా పరిచయం చెయ్యాల్సిన అవసరం లేదు.
తెలుగు తెరకు హాట్ యాంకర్ గా పరిచయం అయ్యి వరుస షోలు చేస్తూ బిజీగా ఉంది.అటు బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తూనే ఇటు వెండితెర మీద కూడా మంచి మంచి అవకాశాలు అందు కుంటూ దూసుకు పోతుంది.
అనసూయ కెరీర్ ఇప్పుడు మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతుంది.
చేతినిండా అవకాశాలను అందు కుంటూ మంచి మంచి పాత్రలు చేస్తూ తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువవుతుంది.
ఈమె నటించిన పుష్ప సినిమా ఈ మధ్యనే రిలీజ్ అయ్యి ఈమెకు కూడా మంచి పేరు తెచ్చిపెట్టింది.ఈ సినిమాలో పొగరుబోతు దాక్షాయణిగా నటించి మంచి మార్కులు కొట్టేసింది.
ఇక మాస్ రాజా రవితేజ నటించిన ఖిలాడీ సినిమాలో కూడా ఈమె నటించింది.
అనసూయ సినిమాలతో, షోలతో ఎంత బిజీగా ఉన్నప్పటికీ ఆమె సోషల్ మీడియాలో మాత్రం ఎప్పుడు యాక్టివ్ గానే ఉంటుంది.ఈమె అప్పుడప్పుడు పెట్టె పోస్టులు వివాదాస్పదం అయ్యి ట్రోల్ కు గురి అవుతూ ఉంటుంది.తాజాగా ఈమె ఉమెన్స్ డే సందర్భంగా పెట్టిన పోస్ట్ వల్ల మళ్ళీ ట్రోల్ కు గురి అయ్యింది.
ఈ రోజు అంతర్జాతీయ ఉమెన్స్ డే సందర్భంగా వారిని పొగుడుతూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టే వారిని ఉద్దేశించి అనసూయ పోస్ట్ చేసింది.
ఈమె పెట్టిన పోస్ట్ చూసి నెటిజెన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.” ఓ సడెన్ గా ప్రతి ట్రోలర్ మరియు మీమర్ మహిళలను గౌరవించడం స్టార్ట్ చేసేసారు.అయితే ఇది కేవలం 24 గంటలలో ముగిసిపోపోతుంది .అందుకే మహిళలు దూరంగా ఉండండి.హ్యాపీ ఫూల్స్ డే” అంటూ అనసూయ చేసిన ట్వీట్ నెట్టింట ఆగ్రహానికి గురి అయ్యింది.
ఈమె ట్వీట్ కు స్పందిస్తూ నెటిజెన్స్.అందరు మగవాళ్ళు ఒకేలా ఉండరు మేడం అంటూ రిప్లై ఇస్తే మరికొంత మంది మాత్రం అవును నిజమే నీలాంటి ఆడవాళ్లు మోసం చేయబట్టే మేము ఇలా మారిపోయాము అంటూ సీరియస్ కామెంట్స్ చేస్తున్నారు.