గతేడాది థియేటర్లలో విడుదలైన కల్కి 2898 ఏడీ( Kalki 2898 AD ) మూవీ బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన సంగతి తెలిసిందే.నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద 1000 కోట్ల రూపాయలకు పైగా కలెక్షన్లను సాధించింది.కల్కి సినిమాకు సీక్వెల్ తెరకెక్కుతుండగా ఈ సీక్వెల్ పై కూడా అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి.2028లో ఈ సీక్వెల్ రిలీజయ్యే ఛాన్స్ అయితే ఉంది.
అయితే కల్కి సినిమాలో ప్రభాస్( Prabhas ) చేసిన ఫైట్ సీన్స్ అన్నీ బాడీ డబుల్ ఫైట్ సీన్స్ అని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.ఇందుకు సంబంధించిన ఒక వీడియో వైరల్ అవుతోంది.
అయితే స్టార్ హీరోలు తమకెరీర్ లో రిస్కీ సన్నివేశాల్లో బాడీ డబుల్ లను ఉపయోగించడం జరుగుతోంది.వాస్తవానికి ఈ సినిమాలో అమితాబ్ కు( Amitabh Bachchan ) కూడా డూప్ గా ఒక వ్యక్తి నటించారు.
డూప్స్, బాడీ డబుల్స్ వాడినంత మాత్రాన స్టార్ హీరోల స్థాయి తగ్గదని కచ్చితంగా చెప్పవచ్చు.

కల్కి సినిమా గురించి కొంతమంది కావాలని నెగిటివ్ కామెంట్లు చేస్తున్న నేపథ్యంలో ఈ సినిమా మేకర్స్ ఏ విధంగా స్పందిస్తారో చూడాల్సి ఉంది.కల్కి సినిమా థియేటర్లలో హిట్ గా నిలిచినా బుల్లితెరపై మాత్రం ప్రేక్షకులను మెప్పించే విషయంలో ఫెయిలైంది.కల్కి సినిమా బాలీవుడ్ ఇండస్ట్రీలో సైతం రికార్డ్ స్థాయిలో కలెక్షన్లను సొంతం చేసుకుందనే సంగతి తెలిసిందే.