అమెరికా నుంచి భారతీయ విద్యార్ధిని స్వీయ బహిష్కరణ.. ఏమైంది?

అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్( Donald Trump ) బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆ దేశంలో అక్రమంగా ఉంటున్న విదేశీయులను బహిష్కరిస్తున్న సంగతి తెలిసిందే.ఈ లిస్ట్‌లో భారతీయులు కూడా ఉన్నారు.

 Indian Student From Columbia University Self-deports After Us Revokes Visa , Us-TeluguStop.com

ఇప్పటికే పలువురు భారతీయులను విడతల వారీగా దేశం నుంచి తరలించింది ట్రంప్ ప్రభుత్వం.తాజాగా హింస, ఉగ్రవాదాన్ని సమర్ధించడంతో పాటు హమాస్‌కు మద్ధతిచ్చే కార్యకలాపాలలో పాల్గొన్నందుకు ఓ భారతీయ విద్యార్ధినికి వీసా రద్దు అయ్యింది.

కొలంబియా యూనివర్సిటీలో చదువుకుంటున్న ఆ విద్యార్ధిని తనకు తానుగా బహిష్కరణ విధించుకుంది.

ఆమెను రంజనీ శ్రీనివాసన్‌గా( Ranjani Srinivasan ) గుర్తించారు.

కొలంబియా యూనివర్సిటీలో అర్బన్ ప్లానింగ్‌లో డాక్టరల్ విద్యార్ధినిగా ఉన్న ఆమె ఎఫ్ -1 స్టూడెంట్ వీసాపై అమెరికాలోకి ప్రవేశించారని హోంలాండ్ సెక్యూరిటీ విభాగం శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపింది.ఉగ్రవాద సంస్థ హమాస్‌కు మద్ధతు ఇచ్చే కార్యకలాపాలలో పాల్గొందని డీహెచ్ఎస్ వెల్లడించింది.

మార్చి 5న అమెరికా విదేశాంగ శాఖ రంజనీ వీసాను రద్దు చేసింది.మార్చి 11న కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్ (సీబీపీ) హోమ్ యాప్‌ను ఉపయోగించి స్వీయ బహిష్కరణకు సంబంధించిన వీడియో ఫుటేజ్‌ను పొందినట్లు డీహెచ్ఎస్ తెలిపింది.

Telugu Columbia, Donald Trump, Indian, Indiancolumbia, Urban Columbia, Visa-Telu

అమెరికాలో నివసించడానికి, చదువుకోవడానికి వీసా పొందడం అనేది ప్రత్యేక హక్కు అని హోంల్యాండ్ సెక్యూరిటీ కార్యదర్శి క్రిస్టి నోయెమ్ అన్నారు.హింస, ఉగ్రవాదాన్ని సమర్ధించినప్పుడు ఆ ప్రత్యేక హక్కును రద్దు చేయాల్సిందేనని నోయెమ్ తెలిపారు.కొలంబియా యూనివర్సిటీ ఉగ్రవాద సానుభూతిపరులలో ఒకరు స్వీయ బహిష్కరణకు సీబీపీ హోమ్ యాప్‌ను ఉపయోగించడం ఆనందంగా ఉందని ఆయన అన్నారు.

Telugu Columbia, Donald Trump, Indian, Indiancolumbia, Urban Columbia, Visa-Telu

మార్చి 10న డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్‌లాండ్ సెక్యూరిటీ .దేశంలో అక్రమంగా ఉంటున్న వారి కోసం స్వీయ బహిష్కరణ ఫీచర్‌తో సీబీపీ హోమ్ యాప్‌ను ప్రారంభించింది.దేశంలో చట్టవిరుద్ధంగా ఉంటున్న వ్యక్తులు దేశం విడిచి వెళ్లాలనే ఉద్దేశాన్ని ప్రభుత్వానికి ఈ అప్లికేషన్ ద్వారా తెలియజేయవచ్చు.

స్వీయ బహిష్కరణ ఆప్షన్‌ను వినియోగించుకున్న వారికి భవిష్యత్తులో చట్టబద్ధంగా అమెరికాకు తిరిగి వచ్చే అవకాశం ఉంటుందని హోంలాండ్ సెక్యూరిటీ తెలిపింది.ఒకవేళ తాము అక్రమ వలసదారులను కనుగొని దేశం నుంచి బహిష్కరిస్తే వారు ఎప్పటికీ అమెరికాకు తిరిగిరారని హెచ్చరించింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube