హైదరాబాద్( Hyderabad ) లాంటి పెద్ద పెద్ద సిటీలలో ట్రాఫిక్ ఎలా ఉంటుందో మనందరికీ తెలిసిందే.అంత ట్రాఫిక్ ఉన్నా సరే కొంతమంది వేగంగా నడుపుతూ వారి ప్రాణాలు తీయడంతో పాటు ఎదుటివారి ప్రాణాలతో కూడా తిరగటం మారుతూ ఉంటారు.
అతివేగం ప్రమాదకరం అని చెప్పిన వినకుండా వాహనదారులు ఇస్తానుసారం బైక్లు కార్లు వంటివి డ్రైవ్ చేస్తూ ఉంటారు.ఇలా రోడ్డు ప్రమాదాల బారినపడి రోజు పదుల సంఖ్యలో మరణిస్తున్నారు.
ఇకపోతే తాజాగా శుక్రవారం రోజూ కూడా ఇలాంటి ఘటన ఒకటి చోటు చేసుకుంది.

జూబ్లీహిల్స్ లోని( Jubilee Hills ) ఒక కారు నియంత్రణ కోల్పోయి బీభత్సాన్ని సృష్టించింది.జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 1 లో నందమూరి హీరో బాలకృష్ణ( Balakrishna ) ఇంటి ముందు ఉన్న ఫుట్పాత్ పైకి ఈ విధంగా దూసుకెళ్లి ఫినిషింగ్ ఢీ కొట్టింది.అయితే అదృష్టవశాత్తు అక్కడ ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది.
ఈ ప్రమాదాన్ని చూసిన వాకర్స్ ఒక్కసారిగా షాక్కు గురయ్యారు.కొద్దిక్షణాల్లోనే తాము ప్రమాదం నుంచి తప్పించుకున్నామని, లేకుంటే విషాదం జరిగి ఉండేదని చెబుతున్నారు.
డ్రైవర్ నిద్రమత్తు వల్లే ఈ ఘటన చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది.కాగా మాదాపూర్ నుంచి జూబ్లీహిల్స్ రోడ్డు గుండా చెక్పోస్ట్ వైపు వెళ్తుండగా కారు అదుపుతప్పి ప్రమాదం జరిగింది.

కారును అతివేగంగా దూసుకొస్తుండగా చూసినవారు భయంతో పరుగులు తీశారు.ఈ ఘటనలో బాలకృష్ణ ఇంటి ముందు ఉన్న ఫెన్సింగ్ ధ్వంసం అవ్వగా, కారు ముందు భాగం పూర్తిగా దెబ్బతింది.ఈ ప్రమాదంలో డ్రైవర్ కు గాయాలైనట్లు సమాచారం.ఈ విషయం తెలియడంతో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు.పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
బాలయ్య బాబు ఈ ఘటనపై ఎలా స్పందిస్తారో చూడాలి మరి.