షాకింగ్ రికార్డ్ సృష్టించిన భారతీయుడు.. హెర్క్యులస్ పిల్లర్స్‌తో విన్యాసాలు.. మస్క్ రియాక్షన్ వైరల్!

భారతదేశం గర్వపడేలా చేశాడు ఓ ఇండియన్.విస్పీ ఖరాడీ అనే మన అథ్లెట్ హెర్క్యులస్ పిల్లర్స్ పట్టుకుని నిలబడటంలో గిన్నిస్ వరల్డ్ రికార్డు కొట్టాడు.

 Indian Man Sets Shocking Record.. Performs Stunts With Hercules Pillars.. Musk's-TeluguStop.com

గుజరాత్‌లోని సూరత్‌లో(Surat, Gujarat) ఈ అద్భుతం జరిగింది.ఏకంగా 2 నిమిషాల 10.75 సెకన్ల పాటు ఆ పిల్లర్స్‌ని పట్టుకుని ప్రపంచాన్ని షాక్ చేశాడు ఖరాడీ.ఖరాడీ (Kharadi) చేసిన ఫీట్ మామూలుది కాదు.

గ్రీకు వీరుడు హెర్క్యులస్ పిల్లర్స్‌లా డిజైన్ చేసిన రెండు భారీ పిల్లర్స్‌ని పైకి లేపి పట్టుకున్నాడు.ఒక్కో పిల్లర్ 123 అంగుళాల పొడవు, 20.5 అంగుళాల వెడల్పు ఉంది.వాటి బరువులు కూడా మామూలుగా లేవు.ఒకటి 166.7 కేజీలు, మరొకటి 168.9 కేజీలు.అంత బరువును అంతసేపు పట్టుకోవడం అంటే మాటలు కాదు.

ఖరాడీ(Kharadi) అసాధారణ బలం, ఓర్పు చూసి అందరూ అవాక్కయ్యారు.గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్(Guinness World Records) వాళ్లే స్వయంగా రికార్డును ధృవీకరించారు.గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ వాళ్లు ఈ వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.దాన్ని చూసిన ఎలాన్ మస్క్(Elon Musk) షాక్ అయ్యి వెంటనే రీ-ట్వీట్ చేశాడు.

దాంతో ఖరాడీ పేరు ప్రపంచమంతా మారుమోగిపోయింది.ఈ విషయంపై ఖరాడీ కూడా తన సంతోషాన్ని వ్యక్తం చేశాడు.“ఎలాన్ మస్క్ నా గిన్నిస్ వరల్డ్ రికార్డ్ వీడియోని షేర్ చేయడం చూసి నాకు చాలా ఆశ్చర్యం వేసింది.భారతీయుడి సత్తా ప్రపంచానికి తెలిసేలా చేసినందుకు గర్వంగా ఉంది” అని ట్వీట్ చేశాడు.

ఖరాడీ ఒక మామూలు వ్యక్తి కాదు.తన ట్విట్టర్ బయో చూస్తేనే అర్థమవుతుంది.ఆయన 13 సార్లు గిన్నిస్ వరల్డ్ రికార్డులు సాధించిన సూపర్ మ్యాన్.బ్లాక్ బెల్ట్ హోల్డర్ (Black belt holder)మాత్రమే కాదు, బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (BSF) కమాండోలకు యుద్ధ విద్యలు నేర్పించే ట్రైనర్ కూడా.

ఒక్క మాటలో చెప్పాలంటే ఆయనొక ఫిట్‌నెస్ ఎక్స్‌పర్ట్.ఇంతకుముందు కూడా ఆయన చాలా రికార్డులు కొట్టాడు.కొన్ని చూస్తే.ఒక నిమిషంలో చేత్తో ఎక్కువ డ్రింక్ క్యాన్స్ ను నుజ్జు చేయడం, ఒక నిమిషంలో తలతో ఎక్కువ ఇనుప చువ్వలను వంచడం ఉన్నాయి.గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ వీడియోకి సోషల్ మీడియాలో విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది.1 కోటి కంటే ఎక్కువ వ్యూస్, 74 వేలకు పైగా లైక్స్‌తో దూసుకుపోతోంది.నెటిజన్లు ఖరాడీని ఆకాశానికెత్తేస్తున్నారు.“వావ్, కంగ్రాట్స్, ఏం సాధించావు సామీ నువ్వు.” అని ఒకరు అనగా “ఈయన వీడియో గేమ్ క్యారెక్టర్‌లా ఉన్నాడు.” అని మరొకరు ఉన్నారు.“భారతదేశం గర్వపడేలా చేశావు.160 కేజీలు ఒక్కో చేత్తో 2 నిమిషాల పైగా పట్టుకోవడం అంటే మామూలు విషయం కాదు.” అని ఇంకొకరు పొగిడారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube