యూకే సూపర్ మార్కెట్ బంపర్ ఆఫర్.. ఫ్రీగా ఫుడ్.. కానీ కండిషన్స్ అప్లై!

యూకేలో అతిపెద్ద సూపర్ మార్కెట్ అయిన టెస్కో, ఆహార వ్యర్థాలను(Tesco, food waste) తగ్గించేందుకు కొత్త ప్రయత్నం మొదలుపెట్టింది.రోజు చివర్లో ఎక్స్‌పైరీకి దగ్గరగా ఉన్న ఫుడ్‌ను ఫ్రీగా ఇవ్వనుంది.

 Uk Supermarket Bumper Offer.. Free Food.. But Conditions Apply!, Tesco Free Food-TeluguStop.com

ఇప్పటికే డిస్కౌంట్ చేసిన “ఎల్లో స్టిక్కర్” ఐటమ్స్‌కు ఇది వర్తిస్తుంది.కొద్ది నెలల్లో కొన్ని చిన్న ఎక్స్‌ప్రెస్ స్టోర్లలో ఈ ట్రయల్ రన్ చేయబోతున్నట్లు బీబీసీ రిపోర్ట్ చేసింది.

ప్రస్తుతం, టెస్కో ఎక్స్‌పైరీ డేట్ (Tesco Expiration Date)దగ్గర పడుతున్న ఫుడ్ ధరలను తగ్గిస్తుంది, కొన్నిసార్లు 90 శాతం వరకు కూడా తగ్గిస్తుంది.ఇప్పుడు ఈ ట్రయల్‌లో భాగంగా, అమ్మకం కాని ఎల్లో స్టిక్కర్ ఐటమ్స్‌ రాత్రి 9:30 తర్వాత ఫ్రీగా ఇస్తారు.అయితే, కస్టమర్లు తీసుకోవడానికి ముందు, చారిటీలకు, స్టోర్ ఉద్యోగులకు మొదటి ప్రాధాన్యత ఉంటుంది.

Telugu Cost, Bank, Waste Uk, Reduce Waste, Supermarket, Tesco, Uk Deals, Yellows

టెస్కో ప్రతినిధి మాట్లాడుతూ, “ఈ ట్రయల్ ద్వారా కస్టమర్లు మిగిలిన ఎల్లో స్టిక్కర్ ఐటమ్స్‌ను రోజు చివర్లో ఫ్రీగా తీసుకోవచ్చు.కానీ వాటిని మొదట చారిటీలకు, ఉద్యోగులకు ఇచ్చిన తర్వాత మాత్రమే కస్టమర్లకు ఇస్తాం.” అని చెప్పారు.టెస్కో చాలా కాలంగా మిగిలిపోయిన ఆహారాన్ని చారిటీలకు, ఫుడ్ బ్యాంక్‌లకు డొనేట్ చేస్తోంది.టెస్కోతో పాటు ఇతర సూపర్ మార్కెట్ చైన్లు కూడా 2030 నాటికి ఆహార వ్యర్థాలను సగానికి తగ్గించాలని ప్రతిజ్ఞ చేశాయి.2023-24లో, టెస్కో తన కార్యకలాపాల నుంచి వచ్చే ఉద్గారాలను 61% తగ్గించింది, ఇది 2025 నాటి లక్ష్యం 60% కంటే ఎక్కువ.ఎనర్జీ, రిఫ్రిజరేషన్‌ను మరింత సమర్థవంతంగా ఉపయోగించడం, 100% పునరుత్పాదక విద్యుత్‌కు మారడం వల్లే ఈ విజయం సాధించామని కంపెనీ తెలిపింది.

Telugu Cost, Bank, Waste Uk, Reduce Waste, Supermarket, Tesco, Uk Deals, Yellows

యూకేలో ఇప్పుడు నిత్యావసరాల ధరలు మండిపోతున్నాయి, చాలా మందికి ఫుడ్ కొనడం కూడా కష్టమవుతోంది.దీంతో డిస్కౌంట్ ఫుడ్‌కు విపరీతమైన డిమాండ్ పెరిగింది.బార్‌క్లేస్ విశ్లేషణ ప్రకారం, 2023లో దాదాపు మూడింట రెండు వంతుల కుటుంబాలు తక్కువ ధరకే దొరికే వస్తువులు కొన్నారట.ఇంకా చెప్పాలంటే, చాలా మంది ఫుడ్ బ్యాంకులపై ఆధారపడుతున్నారు.

ట్రస్సెల్ ట్రస్ట్ రిపోర్ట్ ప్రకారం, గత రెండేళ్లలో 14 లక్షల మందికి పైగా కొత్త యూజర్లు ఫుడ్ బ్యాంక్‌లను సందర్శించారు.టెస్కో ట్రయల్ ఆహార వ్యర్థాలను తగ్గించడానికే కాకుండా, ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలకు కూడా సహాయపడుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube