తెలుగు సినీ ప్రేక్షకులకు టాలీవుడ్ నటి సురేఖ వాణి( Actress Surekha Vani ) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.తెలుగులో ఎన్నో సినిమాలలో నటించి నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది.
సురేఖ వాణి కూతురు సుప్రీత గురించి కూడా మనందరికీ తెలిసిందే.తల్లికి మించిన పాపులారిటీ సంపాదించుకుంది.
ప్రస్తుతం సినిమాలు వెబ్ సిరీస్ లలో నటిస్తోంది సుప్రీత.సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటూ తనకు తన తల్లికి సంబంధించిన ఫోటోలు వీడియోలు ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేస్తూనే ఉంటుంది.
అయితే టాలీవుడ్( Tollywood ) డెబ్యూ ఫై చాలా ఆశలు పెట్టుకుంది సుప్రీత.ఆ సంగతి పక్కన పెడితే ప్రస్తుతం ఈమె ఒక సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే.

ఇకపోతే తాజాగా సుప్రీత చిక్కుల్లో పడింది.అందుకు గల కారణం బెట్టింగ్ ఈ యాప్ ను ప్రమోట్ చేయడమే.ఇటీవల కాలంలో చాలామంది బెట్టింగ్ యాప్స్( Betting apps ) ప్రమోట్ చేయడంతో అవి నిజమని కొందరు నమ్మి వాటిలో బెట్టింగ్స్ పెట్టి ప్రాణాలు కూడా కోల్పోయిన విషయం తెలిసిందే.డబ్బుకు డబ్బు ప్రాణానికి ప్రాణం అన్నట్టుగా డబ్బు ప్రాణం రెండు పోతున్నాయి.
చాలామంది ఆస్తులు పోగొట్టుకున్నారు.ఈ విషయం సీరియస్గా తీసుకున్న ఐపీఎస్ ఆఫీసర్, తెలంగాణ ఆర్టీసీ ఎండి సజ్జనార్ ( Telangana RTC MD Sajjanar )మండిపడిన విషయం తెలిసిందే.
ముఖ్యంగా ఇలాంటి యాప్స్ ని ప్రమోట్ చేసే వారిపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.

అలాగే ఎప్పటికప్పుడు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్న వాళ్లను హెచ్చరిస్తూ వస్తున్నారు సజ్జనార్.అయితే అందులో భాగంగానే పలు అరెస్టులు కూడా చోటు చేసుకుంటున్న విషయం తెలిసిందే.లోకల్ బాయ్ నాని అనే ఇన్ ఫ్లూయన్సర్ ను వైజాగ్ పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.
అదే విధంగా ఇంటర్నేషనల్ బైక్ రైడర్ బన్నీ సన్నీ యాదవ్ పై కూడా సూర్యాపేట జిల్లా నూతన్ కల్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది.అయితే ఇలాంటి ఒక యాప్ ను సురేఖ వాణి కూతురు సుప్రీత ప్రమోట్ చేసి పోలీసుల దృష్టిలో పడింది.
అందుకే సారీ చెబుతూ తాజాగా ఒక వీడియో రిలీజ్ చేసింది.ఆ వీడియోలో సుప్రీత మాట్లాడుతూ.కొంతమంది ఇన్ ఫ్లూయన్సర్లు తెలిసో తెలియకో బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేశారు.వాళ్లలో నేను కూడా ఒకదాన్ని.
ఇప్పుడు ఆ పని చేయడం ఆపేశాను.గతంలో ప్రమోట్ చేసినందుకు సారీ.
ఇంకా ఎవరైనా ఇన్ ప్ల్యూయన్సర్లు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తుంటే ఆపేయండి అని ఆ వీడియోలో చెప్పుకొచ్చింది.ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
అయితే గతంలో లోకల్ బాయ్ నాని కూడా ఇలాంటి విషయం నుంచి తొందరగా తీరుకొని సారీ చెప్పినప్పటికీ అరెస్టు చేసిన విషయం తెలిసిందే.మరి సుప్రీతను కూడా అరెస్ట్ చేస్తారా లేదా అన్నది చూడాలి మరి.