నాని( Nani ) ప్రొడ్యూసర్ గా రామ్ జగదీష్ దర్శకత్వంలో వచ్చిన కోర్టు సినిమా( Court Movie ) సక్సెస్ ఫుల్ టాక్ ను సంపాదించుకొని ముందుకు దూసుకెళ్తుంది.అయితే ఈ సినిమాతో నాని మరోసారి ప్రొడ్యూసర్ గా( Producer ) సక్సెస్ అయ్యాడు అంటూ చాలా వార్తలైతే వస్తున్నాయి.
మరి ఏది ఏమైనా కూడా నాని ప్రొడ్యూసర్ గా మారినప్పటి నుంచి వరుసగా సక్సెస్ ఫుల్ సినిమాలను మాత్రమే చేస్తూ ముందుకు దూసుకెళ్తూ ఉండటం విశేషం.ఆయన చేసిన ప్రతి సినిమా యావత్ ప్రేక్షకులందరిని ఆకట్టుకుంటుంది.
తద్వారా సినిమా విజయంలో ఆయన కీలకపాత్ర వహిస్తూ వస్తున్నాడు.ఇక తన తదుపరి సినిమాని చిరంజీవితో నిర్మిస్తున్న విషయం మనకు తెలిసిందే.
శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కబోతుంది.

మరి నాని తనదైన రీతిలో సత్తా చాటుకుంటాడా లేదా అనేది తెలియాలంటే మాత్రం ఈ సినిమా సెట్స్ మీదికి వెళ్లి రిలీజ్ అయితే గానీ తెలియదు.మొత్తానికైతే కోర్టు సినిమాతో ఒక ఎంగేజింగ్ డ్రామా సినిమాని ప్రేక్షకుల ముందు ఉంచిన నాని ఈ సినిమాతో మరోసారి ప్రొడ్యూసర్ గా తన సత్తా చాటుకోవడమే కాకుండా సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ గా కూడా మారిపోయాడు.

వరుసగా నాలుగు విజయాలతో మంచి ఊపు మీదున్న నాని ఇక చిరంజీవి( Chiranjeevi ) సినిమాతో సూపర్ సక్సెస్ ని అందుకుంటే స్టార్ ప్రొడ్యూసర్ గా మారిపోతాడు.ఇప్పటికే హీరోగా అంచలంచెలుగా ఎదుగుతూ ముందుకు దూసుకెళ్తున్న నాని ప్రొడ్యూసర్ గా కూడా తనదైన రీతిలో సత్తా చాటుకుంటాడని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు… నాని లాంటి నటుడు తెలుగు సినిమా ఇండస్ట్రీకి చాలా అవసరం ఆయన చేస్తున్న సినిమాలు తెలుగు సినిమా ఇండస్ట్రీ స్థాయిని పెంచే విధంగా ఉండడం విశేషం…చూడాలి మరి ఇక మీదట ఆయన ఎలాంటి సినిమాలు చేస్తాడు తద్వారా ప్రేక్షకులను ఎలా మెప్పిస్తాడు అనేది…
.