తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎంతో పేరు ప్రఖ్యాతలు పొందిన వారిలో సీనియర్ నటి సావిత్రి (Savitri)గారి గురించి ఎంత చెప్పినా తక్కువే.ఎంతోమందికి స్ఫూర్తిగా నిలిచిన ఈమె తన సినీ కెరియర్లో ఎన్నో అద్భుతమైన విజయాలను సొంతం చేసుకున్నారు.
ఇక వ్యక్తిగత జీవితంలో కూడా మంచి వ్యక్తిత్వం కలిగినటువంటి సావిత్రి తాను సంపాదించింది మొత్తం ఇతరులకు దానధర్మాలు చేయటానికే ఖర్చు చేసేవారు.అయితే సావిత్రి తన చివరి రోజులను ఎంతో కఠినంగా గడిపారని చెప్పాలి.
ఇక ఈమె జీవిత చరిత్ర మహానటి(MahaNati) సినిమా ద్వారా ప్రతి ఒక్కరికి తెలియజేశారు.

ఇదిలా ఉండగా తాజాగా బిగ్ బాస్ బ్యూటీ గీతూ రాయల్(Geethu Royal) మహానటి సావిత్రి గురించి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం తీవ్ర స్థాయిలో విమర్శలకు కారణమవుతున్నాయి.తాజాగా గీతూ రాయల్ మాట్లాడుతూ.జీవితంలో ఒకరిని ప్రేమిస్తున్నటువంటి వారిని అలాగే పెళ్లి చేసుకున్నటువంటి వారిని దయచేసి ఇష్టపడకండి అంటూ ఈమె తెలియజేశారు.
మహానటి సినిమా చూసినప్పుడు నాకు ఒకటే అనిపించింది.సావిత్రమ్మ చాలా గొప్పది.
కానీ పెళ్లయి పిల్లలు ఉన్నారు అని తెలిసినా జెమిని గణేశన్(Gemini Ganeshan) ని పెళ్లి చేసుకుంది.ఆమె జీవితంలో చేసిన అతి పెద్ద తప్పు ఇదే అని తెలిపారు.

సావిత్రి గారు మాత్రం వేరే ఆమె భర్తను పెళ్లి చేసుకోవచ్చు కానీ ఆమె భర్త వేరే అమ్మాయితో ఉంటే మాత్రం చూసి తట్టుకోలేకపోయారు.కర్మ అనేది బూమ్ రాంగ్ లాంటిది.ఆమె ఏదైతే చేసిందో ఆమెకు అదే తిరిగి వచ్చింది.మీ లైఫ్ లో కూడా అదే జరుగుతుంది.ఒకరు మీ కోసం వేరే వాళ్ళని వదిలేస్తున్నారంటే రేపు వేరే వాళ్ళ కోసం మిమ్మల్ని వదిలేస్తారు జాగ్రత్త అంటూ ఈమె చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం తీవ్రదుమారం రేపుతున్నాయి ఈమె ఎవరిని ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేసిందో తెలియదు కానీ ఉదాహరణకు సావిత్రి జీవితం తీసుకోవడంతో అభిమానులు విమర్శిస్తున్నారు.సావిత్రి గారి జీవితాన్ని జడ్జ్ చేసే స్థాయిలో నువ్వు ఉన్నావా అంటూ విమర్శలు కురిపిస్తున్నారు.