ఇప్పటివరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ( Telugu film industry )ప్రతి హీరో తనకంటూ ఒక ప్రత్యేకమైన సాధించుకుంటూ ముందుకు దూసుకెళుతున్నారు.మరి ఇలాంటి క్రమంలోనే ప్రేమకథా చిత్రాలను చేస్తూ తనకంటూ ఒక వైవిధ్యభరితమైన గుర్తింపును సంపాదించుకున్న కిరణ్ అబ్బవరం( Kiran Abbavaram ) లాంటి హీరో సైతం రీసెంట్ గా వచ్చిన దిల్ రూబా సినిమాతో ప్రేక్షకులను ఏ మాత్రం ఆకట్టుకోలేకపోయాడు.
గత సంవత్సరం వచ్చిన ‘క’ సినిమా( ‘Ka’ movie ) మంచి విజయాన్ని సాధించడంతో ప్రేక్షకులందరిలో అతనికి మంచి గుర్తింపైతే వచ్చింది.కానీ దిల్ రూబా సినిమా ఆశించిన మేరకు విజయాన్ని సాధించకపోవడంతో ఆయన మరోసారి ఢీలా పడిపోయాడు.

మరి ఇక మీదట ఆయన చేసే సినిమాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు సాగాల్సిన అవసరం కూడా ఉంది.ఇక మీదట కూడా ఇలాంటి ప్లాప్ లు వస్తే ఆయన చాలావరకు ఇబ్బందుల్లో పడే పరిస్థితులు రావచ్చు.తద్వారా ఆయన మార్కెట్ కూడా భారీగా పడిపోవచ్చు.కాబట్టి ఇకమీదట చేయబోయే సినిమాలతో భారీ రేంజ్ సినిమాలను చేస్తూ తనకంటూ ఒక సపరేట్ ఇమేజ్ ను క్రియేట్ చేసుకోవాలని చూస్తున్నాడు.
మరి ఈ సినిమాలతో ఆయన ఎలాంటి సక్సెస్ లను సాధిస్తాడు.తద్వారా ఆయన చేయబోయే సినిమాలు ఎలాంటి విజయాలను అందుకోబోతున్నాయి నేది కూడా తెలియాల్సి ఉంది.

ఇక ఇప్పటివరకు ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోలందరూ వాళ్ళని వాళ్ళు స్టార్లు గా ఎస్టాబ్లిష్ చేసుకుంటూ ముందుకు సాగుతున్న క్రమంలో కొంతమంది హీరోలు మాత్రం వరుస విజయాలను సాధించడంలో వెనకబడిపోతున్నారు.అందులో కిరణ్ అబ్బవరం ఒకరు.ఆయన అడపదడప హిట్లను కొడుతూ ఆయన ఇండస్ట్రీలో తన కెరీయర్ ను ముందుకు లాగిస్తూ ఉండడం విశేషం…చూడాలి మరి ఈ సినిమాతో ఆయన ఎలాంటి సక్సెస్ ను సాధిస్తాడు అనేది…
.