కృతజ్ఞత లేకుండా బ్రతకొద్దు... బండ్ల గణేష్ కౌంటర్ నాగబాబుకేనా.... వైరల్ అవుతున్న పోస్ట్!

బండ్ల గణేష్(Bandla Ganesh) పరిచయం అవసరం లేని పేరు.సినీ ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కొనసాగుతూ అనంతరం నిర్మాతగా సక్సెస్ అందుకున్నారు.

 Bandla Ganesh Gives Counter To Nagababu Over Janasena Pitapuram Varma Issue, Pit-TeluguStop.com

ఈయన నిర్మాణంలో వచ్చిన సినిమాలు ఎంతో అద్భుతమైన విజయాలను అందుకున్నాయి.అయితే గత కొంతకాలంగా బండ్ల గణేష్ సినిమాలకు పూర్తిగా దూరంగా ఉంటున్నారు.

ఇలా ఒకవైపు సినిమాలలో ఉంటూనే కాంగ్రెస్ పార్టీకి పూర్తిస్థాయిలో మద్దతు తెలుపుతూ వచ్చారు.ఇక ఇటీవల తెలంగాణలో కాంగ్రెస్ మంచి విజయం అందుకోవటంతో బండ్ల గణేష్ పెద్ద ఎత్తున సంబరాలు చేసుకున్నారు.

బండ్ల గణేష్ రాజకీయాలలో ఉన్నప్పటికీ కూడా పెద్దగా చురుగ్గా పాల్గొనడం లేదు కానీ సినిమాలకు సంబంధించిన విషయాలు రాజకీయాలకు సంబంధించిన విషయాలపై స్పందిస్తూ సోషల్ మీడియాలో ఈయన చేసే పోస్టులు మాత్రం సంచలనంగా మారుతూ ఉంటాయి.అయితే తాజాగా బండ్ల గణేష్ చేసిన పోస్ట్ ప్రస్తుతం పలు చర్చలకు కారణం అవుతుంది.

తాజాగా ఈయన ఎక్స్ వేదికగా స్పందిస్తూ.

Telugu Bandla Ganesh, Bandlaganesh, Nagababu, Pawan Kalyan, Pitapuram, Varma-Mov

కృతజ్ఞత లేకుండా బతకడం మానవత్వాన్ని కోల్పోవడమే, ద్రోహంతో బతకడం మనుష్యత్వాన్ని నాశనం చేసుకోవడమే.ఒక మనిషి జీవితంలో కృతజ్ఞత ఎంత ముఖ్యమో, ద్రోహం ఎంత ప్రమాదకరో స్పష్టంగా తెలియజేస్తుంది.మనం ఎప్పుడూ కృతజ్ఞతతో జీవించాలనీ పోస్ట్ చేశారు అయితే ఈయన పోస్ట్ ఎవరిని ఉద్దేశించి చేశారో తెలియదు కానీ నేటిజన్స్ మాత్రం కచ్చితంగా ఈ పోస్ట్ నాగబాబును ఉద్దేశించి చేశారంటూ భావిస్తున్నారు.

ఇటీవల నాగబాబు జనసేన పార్టీ ఆవిర్భావ కార్యక్రమంలో మాట్లాడుతూ పిఠాపురంలో పవన్ కళ్యాణ్ తమ వల్లె గెలిచారని ఎవరైనా భావిస్తే అది వారి కర్మ అంటూ మాట్లాడారు.

Telugu Bandla Ganesh, Bandlaganesh, Nagababu, Pawan Kalyan, Pitapuram, Varma-Mov

నిజానికి పవన్ కళ్యాణ్(Pawan Kalyan) పిఠాపురంలో పోటీ చేస్తున్న నేపథ్యంలో తెలుగుదేశం పార్టీకి చెందిన అభ్యర్థి వర్మ (Varma)తన సీటును త్యాగం చేయడమే కాకుండా పవన్ కళ్యాణ్ కోసం పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలు కూడా చేశారు.అయితే ఈయన వర్మ గురించే ఇలాంటి వ్యాఖ్యలు చేశారని నాగబాబు తీరుపై విమర్శలు వస్తున్నాయి.ఇలాంటి తరుణంలోనే బండ్ల గణేష్ చేసిన ఈ పోస్ట్ కూడా నాగబాబును (Nagababu) ఉద్దేశించి చేశారు అంటూ పలువురు కామెంట్లు చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube