సినిమాలు సక్సెస్ అవడం అన్నది ఇప్పుడు కలెక్షన్ల పరంగానే చెప్పేస్తున్నారు.సినిమా కథ బాగుంది అంటే వందల, వేలకోట్ల కలెక్షన్స్ ను కూడా రాయబడుతున్నాయి.
ఇటీవల కాలంలో వచ్చిన సినిమాలు రికార్డుల మోత మోగించిన విషయం తెలిసిందే.కొన్ని కొన్ని సార్లు ప్రేక్షకులలో వచ్చే అద్భుతమైన స్పందనాన్ని బట్టి కూడా సినిమా అగ్రస్థానానికి చేరుతూ ఉంటుంది.
అయితే నిజానికి సినిమా విజయం ఎంతమంది ప్రేక్షకులు థియేటర్లకు వచ్చారు అన్న విషయంపై ఆధారపడి ఉంటుందని చెప్పాలి.దీన్నే ఫుట్‌ఫాల్స్ అని కూడా అంటారు.
అలా భారతీయ సినిమా చరిత్రలోనే( history of Indian cinema ) కొన్ని సినిమాలు అభిమానులను ప్రేక్షకులను థియేటర్లకు రప్పించాయి.అంతేకాకుండా ఆ సినిమాలో గడిచిన 50,60 ఏళ్లలో ఎవరూ తాకలేని రికార్డులను కూడా నెలకొల్పాయి.

ఇంతకీ ఆ సినిమాలు ఏవి అన్న విషయానికి వస్తే. మగధీర, దంగల్, కేజీఎఫ్ ( Magadheera, Dangal, KGF )లాంటి సినిమాలు ఎంతగా కలెక్షన్లను రాబట్టినా, ఓల్డ్ క్లాసిక్స్ ఉన్న రికార్డుల ముందు అవి తేలిపోతాయి.1975లో వచ్చిన షోలే ఇప్పటికీ అత్యధికంగా 12.73 కోట్ల( 12.73 crores ) మంది ప్రేక్షకులను థియేటర్లకు రప్పించిన సినిమాగా నిలిచింది.అలాగే, మగల్ ఎ ఆజం, మదర్ ఇండియా వంటి సినిమాలు దశాబ్దాల పాటు రన్ అవుతూ కలెక్షన్లు మాత్రమే కాకుండా ప్రేక్షకుల స్పందనలో కూడా అగ్ర స్థానాల్లో నిలిచాయి.
అయితే ఇప్పటివరకు భారతీయ సినిమాను పరిపూర్ణంగా శాసించిన మూడు గొప్ప రికార్డులు చూస్తే మొదటిది షోలే సినిమా అని చెప్పాలి.

ఈ సినిమా ఏకంగా 12.73 కోట్ల ఫుట్‌ఫాల్స్ తో సరికొత్త రికార్డును సృష్టించింది.ఈ సినిమా తర్వాత రెండో స్థానంలో నిలిచిన సినిమా బాహుబలి 2.ఈ సినిమా 10.77 కోట్ల మంది ప్రేక్షకులను థియేటర్లకు రప్పించి దేశవ్యాప్తంగా.ఇండస్ట్రీ రికార్డులను తిరగ రాసిందని చెప్పాలి.కాగా ఒకానొక సమయంలో కలెక్షన్లు, రన్ టైమ్ మాత్రమే సినిమాకు అగ్రస్థానాన్ని ఇచ్చేవి.కానీ ఇప్పుడు పరిస్థితి మారింది.భారతీయ సినిమా బాక్సాఫీస్ రికార్డులను అంతర్జాతీయంగా హైలెట్ అవుతోంది.ఇంతకు ముందు హాలీవుడ్ సినిమాలు మాత్రమే సాధించిన రికార్డులను ఇప్పుడు ఇండియన్ సినిమాలు తిరగరాస్తున్నాయి.2023-24 కాలంలోనే కెజిఎఫ్ 2, పఠాన్, జవాన్, సలార్ వంటి సినిమాలు భారీ వసూళ్లు రాబట్టాయి.అయితే పుష్ప 2 మాత్రం ఊహించని రీతిలో ప్రేక్షకులను ఆకర్షించింది.చాలా తక్కువ టైమ్ లోనే పుష్ప 2 సరికొత్త రికార్డును నెలకొల్పింది.ఈ సినిమా 6.12 కోట్ల ఫుట్‌ఫాల్స్ ను రాబట్టి టాప్ 10 లిస్ట్ లో ప్రవేశించింది.అంతే కాదు, ప్రపంచ వ్యాప్తంగా 1800 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించింది.ఇది తెలుగు సినిమా గర్వించదగ్గ విజయంగా మారింది.ఇకపోతే ఇప్పటి వరకు భారతీయ సినిమా చరిత్రలో అత్యధికంగా ఫుట్‌ఫాల్స్ సాధించిన టాప్ 5 సినిమాలు ఏవి అన్న విషయానికి వస్తే.మొదటి స్థానంలో షోలే 12.73 కోట్లతో ఉంది.రెండవ స్థానంలో బాహుబలి సినిమా 10.77 కోట్లతో ఉంది.మగల్ ఎ ఆజం 9.17 కోట్ల మందితో మూడవ స్థానంలో నిలిచింది.మదర్ ఇండియా 8.89 కోట్లతో నాలుగో స్థానంలో నిలిచింది.హమ్ ఆప్‌కే హై కౌన్ 7.79 కోట్లతో ఐదవ స్థానంలో నిలిచింది.







