ప్రముఖ హీరో నాని( Nani ) నిర్మాతగా ప్రియదర్శి, రోషన్, శ్రీదేవి( Priyadarshi, Roshan, Sridevi ) ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన కోర్ట్ మూవీ( Court movie ) పాజిటివ్ రెస్పాన్స్ ను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.పోక్సో చట్టంలోని లోపాలను ఎత్తిచూపుతూ తెరకెక్కిన కోర్ట్ మూవీ కలెక్షన్ల విషయంలో సైతం అదరగొడుతోంది.12 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా డిజిటల్ హక్కులు 8 కోట్ల రూపాయలకు అమ్ముడయ్యాయని తెలుస్తోంది.
ఈ సినిమా తొలిరోజే ఏకంగా 8.10 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లను సొంతం చేసుకుంది.ఫస్ట్ వీకెండ్ కలెక్షన్లతోనే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావడంతో పాటు నిర్మాతలకు మంచి లాభాలను అందించే అవకాశాలు ఉన్నాయి.
రిలీజ్ కు రెండు రోజుల ముందే ఈ సినిమాకు పెయిడ్ ప్రీమియర్స్ ప్రదర్శితం కాగా క్రిటిక్స్ నుంచి, నెటిజన్ల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ రావడం ఈ సినిమాకు ప్లస్ అయింది.

ఈ సినిమాలో మంగపతి పాత్రను హీరో శివాజీ( Shivaji) పోషించగా ఆ పాత్రకు శివాజీ ప్రాణం పోశారని కామెంట్లు వినిపిస్తున్నాయి.ఇంద్ర, ఒట్టేసి చెబుతున్నా సినిమాలలో సైతం శివాజీ నెగిటివ్ షేడ్స్ లో ఉన్న పాత్రల్లో నటించి తన నటనతో మెప్పించారు.రాబోయే రోజుల్లో శివాజీకి మూవీ ఆఫర్లు మరింత పెరగడం పక్కా అని చెప్పడంలో సందేహం అయితే అవసరం లేదు.

స్టార్ హీరోల సినిమాలలో ఆఫర్లు వస్తే శివాజీ దశ తిరిగినట్టేనని చెప్పవచ్చు.శివాజీ రెమ్యునరేషన్ సైతం కోర్ట్ సినిమా సక్సెస్ తో పెరిగే అవకాశాలు ఉన్నాయి.శివాజీకి సెకండ్ ఇన్నింగ్స్ కెరీర్ పరంగా ఊహించని స్థాయిలో కలిసొస్తుందని కామెంట్లు వినిపిస్తున్నాయి.శివాజీ కెరీర్ ప్లానింగ్ ఏ విధంగా ఉండనుందో చూడాలి.ఇతర నటులకు భిన్నంగా శివాజీ అడుగులు వేస్తున్నారు.కోర్ట్ సినిమాలో యాక్ట్ చేస్తున్న సమయంలో నా అరుపులకు సెట్లో చాలామంది భయపడ్డారని ఆయన అన్నారు.