ఈ టేస్టీ బీట్ రూట్ సలాడ్ ఎన్ని అద్భుత ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుందో తెలుసా?

బీట్ రూట్..

 Do You Know How Many Amazing Health Benefits This Tasty Beetroot Salad Offers? B-TeluguStop.com

దీని గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు.అద్భుతమైన దుంపల్లో ఇది ఒకటి.

రుచికి తియ్య‌గా ఉన్నా బీట్ రూట్ లో ఎన్నో అమోఘమైన పోషకాలు నిండి ఉంటాయి.అయితే చాలా మంది బీట్ రూట్ కర్రీస్ రూపంలో తీసుకునేందుకు ఇష్టపడ‌రు.

మీరు ఈ జాబితాలో ఉన్నారా.? అయితే అస్సలు వర్రీ వద్దు.బీట్ రూట్ ను ఇప్పుడు చెప్పబోయే సలాడ్ రూపంలో తీసుకుంటే టేస్ట్ తో పాటు ఎన్నో అద్భుత ఆరోగ్య ప్రయోజనాలను కూడా పొందొచ్చు.మరి ఇంకెందుకు ఆలస్యం బీట్ రూట్ సలాడ్ ను ఎలా తయారు చేసుకోవాలి.? మరియు అది అందించే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి.? అన్నది ఇప్పుడు తెలుసుకుందాం.

ముందుగా ఒక బీట్ రూట్ ను తీసుకుని తొక్క తొలగించి వాటర్ లో శుభ్రంగా కడగాలి.ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని అందులో ఒకటిన్నర గ్లాస్ వాటర్ పోయాలి.

వాటర్ కాస్త మరిగిన తర్వాత అందులో బీట్ రూట్ వేసి ప‌దిహేను నుంచి ఇర‌వై నిమిషాల పాటు ఉడికించాలి.ఇలా ఉడికించిన బీట్ రూట్‌ ను సన్నగా తురుముకోవాలి.

ఇప్పుడు ఈ బీట్ రూట్ తురుములో ఒక కప్పు ఫ్రెష్ పెరుగు, పావు టేబుల్ స్పూన్ మిరియాల పొడి, రుచికి సరిపడా పింక్‌ సాల్ట్, చిటికెడు చాట్ మసాలా వేసుకుని అన్ని కలిసేంతవరకు మిక్స్ చేసుకోవాలి.

చివరిగా వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ లో హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర, హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు, చిటికెడు పసుపు, రెండు రెబ్బ‌ల‌ కరివేపాకు వేయించి బీట్ రూట్ మిశ్రమంలో కలిపితే మన టేస్టీ సలాడ్ సిద్ధమవుతుంది.ఈ బీట్ రూట్ స‌లాడ్ ను డైట్ లో కనుక చేర్చుకుంటే రక్తహీనత సమస్య దూరం అవుతుంది.చర్మం కాంతివంతంగా మారుతుంది.

అధిక రక్తపోటు సమస్య నుంచి విముక్తి లభిస్తుంది.కంటి చూపు పెరుగుతుంది.

సంతాన సమస్యలు ఏమైనా ఉంటే దూరం అవుతాయి.రక్తంలో చక్కెర స్థాయి అదుపులో ఉంటుంది.

మరియు గుండె పోటు వచ్చే రిస్క్ సైతం తగ్గుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube