సాధారణంగా కొందరికి ముఖంపై ముదురు రంగు మచ్చలు ఏర్పడుతుంటాయి.మొటిమలు, పిగ్మెంటేషన్, ధూమపానం, వయసు పైబడటం తదితర కారణాల వల్ల చర్మంపై నలుపు లేదా గోధుమ రంగు మచ్చలు ఏర్పడుతుంటాయి.
ఇవి చర్మ సౌందర్యాన్ని తీవ్రంగా దెబ్బ తీస్తాయి.అలాగే ముఖంలో కాంతిని తగ్గిస్తాయి.
ఈ క్రమంలోనే ముఖం పై ఏర్పడ్డ మచ్చలను నివారించుకోవడం కోసం నానా ప్రయత్నాలు చేస్తుంటారు.అయితే ఒక్కోసారి ఎన్ని చేసినా ముఖంపై మచ్చలు తగ్గవు.
అలాంటి సమయంలో ఇప్పుడు చెప్పబోయే పవర్ ఫుల్ రెమెడీని పాటిస్తే త్వరగా సమస్యను పరిష్కరించుకోవచ్చు.మరి ఇంకెందుకు ఆలస్యం ఆ పవర్ ఫుల్ రెమెడీ ఏంటో ఆలస్యం చేయకుండా తెలుసుకుందాం పదండి.
ముందుగా బ్లెండర్ తీసుకుని అందులో రెండు టేబుల్ స్పూన్లు సన్ ఫ్లవర్ సీడ్స్ వేసి మెత్తని పౌడర్ లా గ్రైండ్ చేసుకోవాలి.
ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని అందులో రెండు టేబుల్ స్పూన్లు సన్ ఫ్లవర్ సీడ్స్ పౌడర్ వేసుకోవాలి.
అలాగే పావు టేబుల్ స్పూన్ జాజికాయ పొడి వేసుకొని కలుపుకోవాలి.చివరగా సరిపడా కొబ్బరి పాలు వేసి అన్నీ కలిసేంత వరకు మిక్స్ చేసుకోవాలి.
ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ముఖానికి ఏదైనా బ్రస్ సహాయంతో మందంగా అప్లై చేసుకోవాలి.
కనీసం ఇరవై నిమిషాల పాటు ఆరపెట్టుకుని అప్పుడు వాటర్ తో శుభ్రంగా చర్మాన్ని క్లీన్ చేసుకోవాలి.రోజుకు ఒకసారి ఈ విధంగా కనుక చేస్తే సన్ ఫ్లవర్ సీడ్స్, జాజికాయ పొడి మరియు కొబ్బరి పాలలో ఉండే ప్రత్యేక సుగుణాలు ఎంతటి మొండి మచ్చలనైనా క్రమంగా తగ్గించేస్తాయి.క్లియర్ అండ్ గ్లోయింగ్ స్కిన్ ను మీ సొంతం చేస్తాయి.
కాబట్టి మొండి మచ్చలతో సతమతం అవుతున్నవారు తప్పకుండా ఈ పవర్ ఫుల్ రెమెడీని పాటించండి.మంచి రిజల్ట్ మీ సొంతం అవుతుంది.