పవన్ కల్యాణ్ స్పీచ్ పై చిరంజీవి రెస్పాన్స్ ఇదే.. తమ్ముడిపై ప్రేమను చాటుకున్నారుగా!

టాలీవుడ్ హీరో మెగాస్టార్ చిరంజీవి( Megastar Chiranjeevi ) గురించి మనందరికీ తెలిసిందే.సీనియర్ హీరో అయిన చిరంజీవి ఈ వయసులో కూడా అదే ఊపుతో సినిమాలలో నటిస్తూ ఈతరం హీరోలకు గట్టి పోటీని ఇస్తున్న విషయం తెలిసిందే.

 Chiranjeevi Surprising Post On Pawan Kalyan Today Speech, Chiranjeevi, Tollywood-TeluguStop.com

సినిమా హిట్ ప్లాప్ తో సంబంధం లేకుండా వరుసగా అవకాశాలను అందుకుంటూ దూసుకుపోతున్నారు చిరంజీవి.అందులో భాగంగానే చివరగా గత ఏడాది వాల్తేరు వీరయ్య సినిమాతో( Waltheru Veeraiah ) ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే.

ఇకపోతే ప్రస్తుతం చిరంజీవి విశ్వంభర మూవీలో నటిస్తున్నారు.వశిష్ట దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ ఇంకా కొంతమేర మిగిలి ఉంది.

Telugu Chiranjeevi, Pawan Kalyan, Tollywood-Movie

ఈ సినిమా ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.అయితే ఈ సినిమాలో వచ్చే సమ్మర్ హాలిడేస్ లో విడుదల చేసే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది.ఆ సంగతి పక్కన పెడితే తాజాగా మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిపై ప్రేమను చాటుకున్నారు.అసలు విషయంలోకి వెళితే.తెలుగు రాష్ట్రాలలో పవర్ స్టార్ అలాగే ఆంధ్ర రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కూడా అయినటువంటి పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) నేడు తన పొలిటికల్ పార్టీ జనసేన 12వ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా తన నియోజకవర్గ పరిధిలోని జరుపుకున్న సంగతి తెలిసిందే.

Telugu Chiranjeevi, Pawan Kalyan, Tollywood-Movie

అయితే ఈ సభలో పవన్ కళ్యాణ్ స్పీచ్ కోసం అంతా ఒక రేంజ్ లో ఎదురు చూడగా ఈ స్పీచ్ పై ఒక సర్ప్రైజింగ్ వ్యక్తి రెస్పాన్స్ అందించడం మెగా అభిమానులుకి మరింత ఆనందం కలిగించింది.ఆ వ్యక్తి మరెవరో కాదు మెగాస్టార్ చిరంజీవి.పవన్ కళ్యాణ్ స్పీచ్ ముగిసిన వెంటనే చిరంజీవి తన ట్విట్టర్ ఖాతాలో ఒక పోస్ట్ చేశారు.

ఈ మేరకు చిరంజీవి తన ఖాతాలో ఈ విధంగా రాసుకొచ్చారు.“మై డియర్ బ్రదర్ పవన్ కళ్యాణ్ జనసేన జయకేతన సభలో నీ స్పీచ్ కి మంత్ర ముగ్ధుడిని అయ్యాను.

సభకు వచ్చిన అశేష జన సంద్రం లానే నా మనసు ఉప్పొగింది.ప్రజల ఆకాంక్షల్ని నెరవేర్చే నాయకుడు వచ్చాడన్న నమ్మకం మరింత బలపడింది.ప్రజా సంక్షేమం కోసం ఉద్యమస్ఫూర్తితో నీ జైత్ర యాత్ర నిర్విఘంగా కొనసాగాలని ఆశీర్వదిస్తున్నాను.జన సైనికులందరికీ హృదయ పూర్వక శుభాకాంక్షలు అంటూ పోస్ట్ లో రాసుకొచ్చారు.

ఈ పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube