టాలీవుడ్ పాన్ ఇండియా హీరో ప్రభాస్( Hero Prabhas ) ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ పాన్ ఇండియా సినిమాలలో నటిస్తూ క్షణం కూడా తీరిక లేకుండా గడుపుతున్న విషయం తెలిసిందే.దాదాపు అరడజన్ కు పైగా పాన్ ఇండియా సినిమాలతో ఫుల్ బిజీబిజీగా గడుపుతున్నారు ప్రభాస్.
ఇప్పుడు ప్రభాస్ చేతిలో ఉన్న సినిమాలు విడుదల కావడానికి కనీసం రెండు మూడేళ్ల సమయం పడుతుంది.ఏడాదికి రెండు సినిమాలు చొప్పున పూర్తి చేసేలా ప్రభాస్ ప్లాన్లు వేసుకున్నారట.
ఆ సంగతి అటు ఉంచితే ప్రస్తుతం ప్రభాస్ చేతిలో ఉన్న సినిమాలతో పాటు మరికొన్ని సినిమాలు కూడా ప్రభాస్ ఖాతాలో చేరుతున్న విషయం తెలిసిందే.

ఒక సినిమా ఇంకా పట్టాలెక్కకు ముందే మరొక సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తున్నారు డార్లింగ్ ప్రభాస్.మిగతా స్టార్స్ కి సాధ్యం కాని విధంగా వరుసగా భారీ సినిమాలు చేస్తున్నారు.ఈ సినిమాలన్నీ కూడా పాన్ ఇండియా సినిమాలే కావడం విశేషం.
అంతే కాదండోయ్ సినిమాలన్నీ కూడా కోట్లతో నిర్మితమవుతున్నవే.ఇది ఇలా ఉంటే తాజాగా అందిన సమాచారం ప్రకారం ప్రభాస్ ఇప్పుడు మరో కొత్త సినిమాకు కమిట్ అయ్యాడట.
అది కూడా ప్రస్తుతం తాను వర్క్ చేస్తున్న డైరెక్టర్ హను రాఘవపూడి తోనే అని తెలుస్తోంది.కాగా డార్లింగ్ ప్రభాస్, హను రాఘవపూడి( Hanu Raghavapudi ) కాంబినేషన్ లో రూపొందుతోన్న మూవీ ఫౌజి.

ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ ( Mythri Movie Makers )నిర్మిస్తున్న విషయం తెలిసిందే.ప్రస్తుతం ఈ సినిమాకు సంబందించిన షూటింగ్ జరుగుతోంది.అయితే హను టాలెంట్ మెచ్చిన ప్రభాస్ ఆయనతో మరో సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడట.ఇప్పటికే హోంబలే ఫిలిమ్స్ నుంచి హనుకి అడ్వాన్స్ కూడా ఇప్పించినట్లు కూడా సమాచారం.
హోంబలే ఫిలిమ్స్ లో ప్రభాస్ మూడు సినిమాలు కమిట్ అయిన విషయం తెలిసిందే.అందులో ఒకటి సలార్2 కాగా, మిగతా రెండు సినిమాలకు ప్రశాంత్ వర్మ, లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తారని ప్రచారం జరిగింది.
అయితే మరి ఇప్పుడు హను ప్రాజెక్ట్ ఆ మూడు సినిమాల్లో ఒక దాని ప్లేస్ లో ఉంటుందా? లేకపోతే ఇది నాలుగో ప్రాజెక్టా అనేది తెలియాల్సి ఉంది.ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో డార్లింగ్ ప్రభాస్ తగ్గేదేలే అంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.