క్రికెట్ మ్యాచ్‌లను వీక్షిస్తున్నప్పుడు, ఆటగాళ్లు తమ ముఖంపై తెల్లటి పౌడర్ రాసుకున్నట్లు మనం చాలాసార్లు గమనించే ఉంటాము.అయితే, దీని వెనుక ఉన్న అసలు కారణం ఏమిటో చాలా మందికి తెలియదు.
క్రికెటర్లు ముఖంపై రాసుకునే ఈ పదార్థాన్ని జింక్ ఆక్సైడ్ అంటారు.ఇది భౌతిక సన్‌స్క్రీన్ లేదా రిఫ్లెక్టర్ గా పని చేస్తుంది.
ముఖ్యంగా యూవీ-ఏ (UVA), యూవీ-బీ (UVB) కిరణాల ప్రభావాన్ని తగ్గించేందుకు ఉపయోగపడుతుంది.

ఈ తెల్లటి పౌడర్ రాసుకోవడంవల్ల కలిగే ప్రయోజనాల విషయానికి వస్తే.క్రికెటర్లు రోజుకు 6 గంటలకు పైగా నేరుగా ఎండలో ఉండాల్సి ఉంటుంది.టెస్ట్ మ్యాచ్‌లలో అయితే 5 రోజుల పాటు ఎండలో ఆడటం మరింత కష్టతరమవుతుంది.
కాబట్టి కొన్ని రసాయన సన్‌స్క్రీన్‌ల మాదిరిగా 20 నిమిషాలు వేచి ఉండాల్సిన అవసరం లేకుండా, జింక్ ఆక్సైడ్ వెంటనే పని చేయడం మొదలుపెడుతుంది.దీని వల్ల చెవి, ముక్కు వంటి భాగాలను UV కిరణాల నుండి రక్షించడంలో ఇది కీలక పాత్ర పోషిస్తుంది.

రసాయన సన్‌స్క్రీన్‌లు కొన్నిసార్లు చర్మానికి ఇబ్బంది కలిగించవచ్చు, కానీ, జింక్ ఆక్సైడ్ పొడి పూర్తిగా సురక్షితమైనది.సూర్యరశ్మి ప్రభావాన్ని తగ్గించేందుకు జింక్ ఆక్సైడ్‌తో కూడిన ఫిజికల్ సన్‌స్క్రీన్ అత్యుత్తమమైన ఎంపిక.ఇది చర్మాన్ని పొడిబారడం, చికాకు, అలర్జీ వంటి సమస్యల నుండి కాపాడుతుంది.అందు కొరకే క్రికెటర్లు తమ ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు ఈ పౌడర్‌ను ముఖానికి అప్లై చేస్తారు.
ఇలా ఆటగాళ్లు తమ ముఖంపై తెల్లటి పౌడర్ రాసుకోవడం ఎక్కువగా టెస్ట్ మ్యాచ్ లలో మనం గమనిస్తూ ఉంటాము.మొత్తంగా ఆటగాళ్ల చర్మ సమస్యలనుండి కాపాడడానికి ఇది ఎంతగానో ఉపయోగ పడుతుంది.