మామూలుగా సినిమా ఇండస్ట్రీలో సెలబ్రిటీలు సినిమాల ఎంపిక విషయంలో సినిమాల విడుదల విషయంలో ఒక్కొక్క విధంగా ఉంటారు.కొంతమంది ఏడాదికి ఒకటి రెండు సినిమాలతో పలకరిస్తే మరి కొంత మంది రెండు మూడేళ్లకి ఒక సినిమా విడుదల చేస్తూ ఉంటారు.
ఈ మధ్యకాలంలో పాన్ ఇండియా ట్రెండ్ మొదలైన తర్వాత చాలా వరకు హీరోలు సినిమాల విషయంలో ఈ మందగమనం రెట్టింపయ్యింది.దీంతో అభిమాన హీరోల కోసం ఎదురుచూస్తూ అలసిపోవడం సినీప్రియుల వంతు అవుతోంది.
అయితే ఇప్పుడు ఈ లెక్కను సరిచేసేందుకు కొందరు అగ్ర హీరోలు నడుం బిగిస్తున్నారు.

త్వరగానే తెరపై సందడి చేసేలా కొత్త సినిమాల విషయంలో పకడ్బందీగా ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు.వరుస చిత్రాలతో బాక్సాఫీస్ ముందు జోరు చూపిస్తామంటూ భరోసా కల్పిస్తున్నారు.ఇంతకీ ఆ స్టార్ హీరోలు ఎవరు అన్న విషయాన్ని వస్తే.
బాహుబలి సినిమాలతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు డార్లింగ్ ప్రభాస్.( Prabhas ) ఆ తర్వాత నుంచి పాన్ ఇండియా చిత్రాలకు చిరునామాగా మారిపోయారు.చేతినిండా బోలెడు సినిమా ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు.అయితే ప్రభాస్ నుంచి ఏడాదికొకటి చొప్పున ఒక సినిమా వస్తున్నప్పటికీ విడుదల తేదీల విషయంలో వాయిదాలు తరచూ కనిపిస్తూనే ఉన్నాయి.
ప్రస్తుతం ది రాజాసాబ్( The Rajasaab ) సినిమాలో కూడా ఇలాగే ఆలస్యమవుతున్న సంగతి తెలిసిందే.ఏప్రిల్‌లోనే రావాల్సిన ఈ చిత్రం చిత్రీకరణతో పాటు గ్రాఫిక్స్ పనుల ఆలస్యం వల్ల ద్వితీయార్ధానికి వెళ్లిపోవడం దాదాపు ఖాయం అయినట్టు తెలుస్తోంది.

ఆర్‌ఆర్‌ఆర్ వంటి సినిమాతో జాతీయ స్థాయిలోనే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.ఇటీవల గేమ్ చేంజర్ సినిమాతో ప్రేక్షకులకు పలకరించారు.ఈ సినిమా కు దాదాపు 3 ఏళ్ల సమయం పట్టింది అని చెప్పాలి.ప్రస్తుతం రామ్ చరణ్( Ram Charan ) బుచ్చిబాబు దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నారు.
జులై, ఆగస్టు కల్లా సినిమా పూర్తయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.అయితే అన్నీ అనుకున్నట్లు జరిగితే దీన్ని ఈ ఏడాది లోనే తెరపై చూసే అవకాశం ఉందట.

జూనియర్ ఎన్టీఆర్( Jr NTR ) కూడా ఆర్ఆర్ఆర్ సినిమాను పూర్తి చేసి తెరపై కనిపించడానికి దాదాపు రెండేళ్ల సమయం పట్టింది.ఇకపోతే ప్రస్తుతం మంచి ఫుల్ జోష్ మీద ఉన్న జూనియర్ ఎన్టీఆర్ ఈ ఏడాది ద్వితీయార్ధంలో వార్ 2( War 2 ) సినిమాతో ప్రేక్షకుల్ని పలకరించనుండగా ఆ వెంటనే 2026 సంక్రాంతి బరిలో దర్శకుడు ప్రశాంత్ నీల్( Prashanth Neel ) సినిమాతో అలరించనున్న విషయం తెలిసిందే.ఈ చిత్రం గత నెలలోనే తొలి షెడ్యూల్ ప్రారంభించుకోగా ఈ నెలలో ఎన్టీఆర్ సెట్స్‌లోకి అడుగు పెట్టనున్నట్లు టాక్.దసరా నాటికి సినిమాని పూర్తి చేయాలన్న లక్ష్యంతో ప్రశాంత్ నీల్ ముందుకు సాగుతున్నట్లు సమాచారం.








