జుట్టు షైనీగా( Shiny Hair ) కనిపించాలని చాలా మంది కోరుకుంటారు.అటువంటి హెయిర్ కోసం రకరకాల ప్రొడక్ట్స్ వాడుతుంటారు.
సెలూన్ లో ఏవేవో ట్రీట్‌మెంట్స్ చేయించుకుంటారు.అమ్మాయిలే కాదు ఈ జాబితాలో అబ్బాయిలు కూడా ఉన్నారు.
అయితే ఎటువంటి ఖర్చు లేకుండా షాంపూ( Shampoo ) సమయంలో ఇప్పుడు చెప్పబోయే సింపుల్ ట్రిక్ ను కనుక పాటిస్తే మీ హెయిర్ సహజంగానే సూపర్ షైనీ గా మెరిసిపోవడం ఖాయం.
అందుకోసం ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో రెండు టేబుల్ స్పూన్లు బియ్యం,( Rice ) వన్ టేబుల్ స్పూన్ మెంతులు( Fenugreek ) మరియు రెండు రెబ్బలు కరివేపాకు వేసుకొని ఒక గ్లాస్ హాట్ వాటర్ పోసి రెండు గంటల పాటు నానపెట్టుకోవాలి.
ఆ తర్వాత మిక్సీ జార్ తీసుకొని అందులో నానబెట్టుకున్న పదార్థాలను వాటర్ తో సహా వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమం నుంచి స్ట్రైనర్ సహాయంతో జ్యూస్ ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలి.

ఈ జ్యూస్ లో ఒక కప్పు నార్మల్ వాటర్ మరియు రెండు టేబుల్ స్పూన్లు రెగ్యులర్ షాంపూ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి.ఈ మిశ్రమాన్ని ఉపయోగించి హెయిర్ వాష్ చేసుకోవాలి.వారానికి ఒకటి లేదా రెండుసార్లు ఇలా చేస్తే అదిరిపోయే బెనిఫిట్స్ ను పొందుతారు.ముఖ్యంగా ఈ విధంగా షాంపూ చేసుకోవడం వల్ల డ్రై అండ్ డ్యామేజ్డ్ హెయిర్ రిపేర్ అవుతుంది.
కురులు సిల్కీ గా, షైనీగా మారతాయి.

అలాగే ఇప్పుడు చెప్పిన ట్రిక్ ను పాటించడం వల్ల జుట్టు రాలడం తగ్గుతుంది.స్కాల్ప్ ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉంటే దూరం అవుతాయి.తల చర్మం తేమగా ఆరోగ్యంగా మారుతుంది.
తలపై పేరుకుపోయిన మురికి, మృత కణాలు తొలగిపోతాయి.చుండ్రు సమస్య దూరం అవుతుంది.
కురులు దృఢంగా మారతాయి.హెల్తీ అండ్ షైనీ హెయిర్ మీ సొంతం అవుతుంది.







