హిమాచల్‌ ప్రదేశ్‌ ప్రమాదకర రహదారుల్లో బస్సు ప్రయాణం.. నెటిజన్ల ప్రశంసలు!

భారతదేశంలోని హిమాచల్‌ ప్రదేశ్‌(Himachal Pradesh in India) అంటే అందమైన ప్రకృతి దృశ్యాలు, భారీ కొండలు, లోయలు గుర్తుకు వస్తాయి.అయితే అక్కడి రహదారుల్లో ప్రయాణించడం మాత్రం భయంకరమైన అనుభవంగా ఉంటుంది.

 Bus Travel On Dangerous Roads In Himachal Pradesh.. Netizens Praise It!, Himacha-TeluguStop.com

ఒళ్లు జల్లుమనిపించే కొండ రహదారుల్లో వాహనాలను నడపడం ఒక సాహసమే అని చెప్పవచ్చు.ఇలాంటి ప్రయాణానికి సంబంధించి తాజగా ఇన్‌స్టాగ్రామ్‌లో (Instagram)ఓ కంటెంట్‌ క్రియేటర్ హిమాచల్‌ ఆర్టీసీ బస్సు(Creator Himachal RTC bus) ప్రయాణ వీడియోను షేర్ చేస్తూ, “ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ప్రయాణించాం” అంటూ తన అనుభవాన్ని వివరించారు.

హిమాచల్‌ ప్రజా రవాణా సేవలు ఎలా ఉంటాయో ఎవరైనా అనుభవించారా? అంటూ ప్రశ్నించారు.ఇందుకు సంబంధించి ఓ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.

ఆ వీడియోలో, ప్రయాణం వంపులు తిరిగిన కొండ అంచుల్లో సాగే భయానక దృశ్యాలతో నిండింది.ఈ వీడియోను చూసిన నెటిజన్లు అక్కడి బస్సు డ్రైవర్ల (Bus drivers)నైపుణ్యాన్ని, ధైర్యాన్ని ప్రశంసిస్తున్నారు.వారు అత్యంత క్లిష్టమైన మార్గాల్లోనూ వాహనాలను చాలా జాగ్రత్తగా నడిపి, ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానానికి చేర్చడాన్ని కొనియాడుతున్నారు.వీడియో చుసిన నెటిజన్స్.ఇది చంబా నుంచి పంగికి వెళ్లే రహదారి అంటూ కొందరు కామెంట్ చేయగా, మరికొందరు అక్కడ నివసించే ప్రజలు కొండల అంచున కాదు, తమ జీవితాల అంచున ప్రయాణిస్తారు అంటూ వారి అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

మరి ఇంకెందుకు ఆలశ్యం మిలో కూడా ఎవరికైనా ఇలాంటి అదుబితా ప్రయాణం చేయాలనుకుంటే వెంటనే ప్రయాణానికి ఏర్పాట్లు చేసుకోండి.అలాగే మిలో ఎవరైనా ఇలాంటి ప్రయాణాలు చేసారా ? ఒకవేళ చేస్తే మీ అనుభవాలను ఇక్కడ షేర్ చేసుకోండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube