దర్శకుడు వి ఎన్ ఆదిత్య( VN Aditya ) మనసంతా నువ్వే సినిమాతో తెలుగు తెరకు పరిచయమై తానేంటో నిరూపించుకొని దాదాపు పదికి పైగా సినిమాలకు దర్శకత్వం వహించారు.ప్రస్తుతం కొత్త సినిమాలను తెరకెక్కించే పనిలో ఉన్న ఆదిత్య తన జీవితంలో జరిగిన ఒక అరుదైన సంఘటనను తన సోషల్ మీడియా ఖాతా ద్వారా తన అభిమానులకు పంచుకున్నాడు.
ఒకరోజు ఆదిత్య వద్దకు రెండు జతల బట్టలు వచ్చాయట.అవి పంపించింది మరెవరో కాదు దర్శకేంద్రుడు కే రాఘవేంద్రరావు( K Raghavendra Rao ).ఆదిత్యకు రాఘవేంద్రరావు బట్టలు పంపించాల్సిన అవసరం ఏమొచ్చింది అందుకు గల కారణం ఏంటో ఈ ఆర్టికల్ లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

జగదేకవీరుడు అతిలోకసుందరి సినిమాకు కె రాఘవేంద్రరావు దర్శకత్వం వహించిన సంగతి మనకు తెలిసిందే ఆ సినిమా విడుదలైన రోజు పెద్ద వర్షం అయితే సినిమా చూడడానికి వెళ్ళిన ఆదిత్య కు గేటు ముందు అడ్డంగా పెద్ద చెట్టు పడిపోవడం చూశాడు ఇంకా టికెట్స్ కౌంటర్ తెరవడానికి సమయం ఉండడంతో తన తో పాటే వచ్చిన వ్యక్తితో కలిసి తెల్లవారేసరికి ఆ చెట్టుని పక్కకు జరిపించారట ఆ సమయంలో చెట్టు కొమ్మకు తగిలి తన షర్ట్ చిరిగిపోయిందట.అలాగే ఆయన తీసిన మరొక సినిమా ఘరానా మొగుడు( Gharana Mogudu ) సినిమా కోసం వెళ్లిన టైం లో పెద్ద క్యూ లైన్ ఉండడంతో పాటు చిన్నపాటి తొక్కిసలాట కూడా జరిగింది.ఆ తోపులో ఆదిత్య వేసుకున్న షర్ట్ చిరిగిపోయిందట.

ఇక ఆ తర్వాత రాఘవేంద్ర రావు గారు సౌందర్య లహరి అనే ప్రోగ్రామ్ కోసం ఆదిత్యని గెస్ట్ గా పిలిచారు.ఆ సందర్భంలో ఓ తాను రెండు సార్లు ఏ రకంగా తన చొక్కలను చించుకున్నరో విషయం చెప్పారట.పూర్తయిన తెల్లవారి ప్రొడక్షన్ మేనేజర్ ఒక అతను ఇల్లు వెతుక్కుంటూ మరీ ఆదిత్య దగ్గరికి వచ్చాడట.వచ్చి రెండు జతలు బట్టలను ఆదిత్య కి గిఫ్ట్ గా ఇచ్చారట.
గురువుగారి వల్లే మీ రెండు చొక్కాలు చిరిగిపోయాయి కదా అందుకే వారు ఈ చొక్కాలను మీకోసం పంపించారు అంటూ నవ్వుకుంటూ చెప్పారట.